MP Magunta Srinivasulu Reddy: దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కాగా రోజురోజుకు ఈ కేసులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న ఈడీ విచారణను వేగవంతం చేస్తోంది. కాగా ఈ స్కాంలో మరో నిందితుడైన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైకాపా నేత, ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరును ఈడీ అధికారులు చేర్చిన సంగతి తెలిసిందే. కాగా దీనిపై స్పందించిన మాగుంట ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనకు ఎలాంటి పాత్ర లేదని గురువారం స్పష్టం చేశారు. లిక్కర్ స్కాంలో తన పేరు చేర్చడంతో ఆశ్చర్యపోయానని ఆయన అన్నారు. గతంలో తాము మద్యం వ్యాపారాలు చేసిన మాట వాస్తవమేనని, అయితే, ఆ వ్యాపారాలను మానేసి చాలాకాలం అయిందని మాగుంట వివరించారు.
ప్రస్తుతం వెలుగు చూసిన స్కాంలో అమిత్ అరోరా పాత్ర కీలకమని ఈడీ అధికారులు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, అమిత్ అరోరా అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని, కనీసం తనకు ముఖ పరిచయం కూడా లేదని మాగుంట చెప్పారు. తనకు గానీ తన కుటుంబానికి గానీ ఈ కేసుతో సంబంధంలేదని స్పష్టం ఆయన చేశారు.
ఇదీ చదవండి: భయపడే ప్రసక్తే లేదు.. జైల్లో పెడతారా పెట్టుకోండి- ఎమ్మెల్సీ కవిత