Site icon Prime9

AP Politics: చోడవరం వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా

mla karanam dharma sri resign his mla post

mla karanam dharma sri resign his mla post

AP Politics: ఏపీ రాజకీయాలు రోజురోజుకు కాకపుట్టిస్తున్నాయి. విశాఖ కేంద్రంగా రాజకీయనేతలు వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతున్నారు. చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతుగా ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామా లేఖను మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటు అయిన నాన్ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్ కు అందించారు.

విశాఖను అమరావతి రైతులు వ్యతిరేకిస్తే తాము అమరావతికి వ్యతిరేకమేనని ధర్మశ్రీ వ్యాఖ్యానించారు. రాజధాని వీకేంద్రీకరణ కోసమే తాను రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా తెదేపా నేతలకు సవాల్ విసిరారు. దమ్ముంటే అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలని ధర్మశ్రీ డిమాండ్ చేశారు. అచ్చెన్నాయుడిపై పోటీ చేసేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నెల 15న విశాఖ రాజధానికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహిస్తామని కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు.
అంబేడ్కర్ సర్కిల్ నుంచి వేల మందితో ర్యాలీ నిర్వంచనున్నట్లు తెలిపారు. భారీ నిరసన ప్రదర్శనతో రాజధాని ఆకాంక్షను యావత్ రాష్ట్రానికి బలంగా తలియజేస్తామన్నారు. జేఏసీ అధ్వర్యంలో వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తామని కరణం ధర్మశ్రీ తెలిపారు. కాగా ఇప్పటికే విశాఖ పరిపాలనా రాజధాని కోసం తాను రాజీనామాకు సిద్దమని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. ఉద్యమంలోకి రావాలని ఉందంటూ వ్యాఖ్యానించారు.

రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా రాజీనామా చేసేందుకు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు సిద్దమవుతున్నారు. ఇప్పటికే అవంతి శ్రీనివాస్ మూడు రాజధానులకు మద్దతుగా అవసరమైతే రాజీనామా చేస్తానంటూ ప్రకటించగా ఇప్పుడు కరణం ధర్మశ్రీ ఏకంగా స్పీకర్ ఫార్మట్ లో రాజీనామా లేఖను సమర్పించడంతో తెదేపా నేతల చుట్టూ వైసీపీ ఉచ్చు బిగిస్తోంది అని చెప్పవచ్చు. అమరావతి రైతులు విశాఖలో అడుగుపెట్టనున్న నేపథ్యంలోనే కావాలనే వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాల పేరుతో డ్రామాలు చేస్తున్నారంటూ తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. మరి ఈ రాజకీయ రగడ ఎటునుంచి ఎటువైపు వెళ్తుంతోనని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.

ఇదీ చదవండి: రాత్రి 7 అయితే ఆ ఊర్లో టీవీలు, సెల్‌ఫోన్లు అన్నీ బంద్..!

Exit mobile version