Site icon Prime9

Chiranjeevi: పవన్‌కు రాష్ట్రాన్ని ఏలే రోజు రావాలి.. రాజకీయాలపై చిరంజీవి ఆసక్తికర కామెంట్స్

chiranjeevi interesting comments on pawan kalyan

chiranjeevi interesting comments on pawan kalyan

Chiranjeevi: చిరంజీవి ముఖ్య పాత్రలో నటించి గాడ్ ఫాదర్ చిత్రం ప్రెస్ మీట్ హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా మెగాస్టార్ తన తమ్ముడు పవన్ కల్యాణ్‌ గురించి ప్రస్తావించారు. పవన్ నిజాయితీగా, ఎంతో నిబద్ధతతో వ్యవహరిస్తాడని స్పష్టం చేశాడు. పవన్ కల్యాణ్ వంటి నిబద్ధత ఉన్న నాయకుడు రాష్ట్రానికి కావాలని ఆయన తెలిపారు. ప్రజలు పవన్‌కు రాష్ట్రాన్ని ఏలే అవకాశం ఇచ్చే రోజు రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని చిరంజీవి చెప్పారు.

తాను భవిష్యత్తులో జనసేనకు మద్దతు ఇస్తానో లేదో తెలియదని మెగాస్టార్ అన్నారు. కానీ తన తమ్ముడు పవన్ కల్యాణ్ మాత్రం మంచి నాయకుడు అవుతాడని ధీమా వ్యక్తం చేశారు. పవన్‌ కల్యాణ్‌కు తన పూర్తి మద్దతు ఉంటుందని మెగాస్టార్ భరోసా ఇచ్చారు. రాజకీయాలపై తన వైఖరేమిటనేది మెగాస్టార్ తేల్చి చెప్పారు. గతంలో తాను నెలకొల్పిన ప్రజారాజ్యం పార్టీని ఎందుకు కాంగ్రెస్‌లో విలీనం చేయాల్సి వచ్చిందనే విషయంపైనా ఆయన స్పష్టతనిచ్చారు. పవన్ ఒక పక్క, తాను ఒక పక్క ఉండకూడదనే ఉద్దేశంతోనే రాజకీయాల నుంచి వైదొలిగానని వివరించారు.

పవన్ రాజకీయంగా ఎదిగేందుకే తాను రాజకీయాలకు దూరం అయ్యానని, ఇదే తాను రాజకీయాలకు దూరంగా ఉండడానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. తాను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నానే కాని రాజకీయం తన నుంచి దూరం కాలేదని చిరంజీవి అన్నారు. రాజకీయాలంటే తనకు ఆసక్తి ఉండటం వల్లే పార్టీని నెలకొల్పానని మెగాస్టార్ చిరంజీవి వివరించారు.

ఇదీ చదవండి: “బాయ్ కాట్” ఆదిపురుష్.. క్రాస్ బ్రీడ్ అంటూ విమర్శలు..!

Exit mobile version