Site icon Prime9

MLC Kavitha: విచారణ ఇంకా పూర్తికాలేదు.. ఎమ్మెల్సీ కవితకు సీబీఐ మరో సారి నోటీస్

cbi-once-again-issued-notices-to-mlc-kavitha under 91 CRPC

cbi-once-again-issued-notices-to-mlc-kavitha under 91 CRPC

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు సీబీఐ షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇది ట్రయల్‌ మాత్రమే.. అసలు కథ ముందుంది అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. నిన్న కేసీఆర్ కూతురు కవితను సీబీఐ సుదీర్ఘ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా ఆ విచారణ అనంతరం కూడా ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ ఇంకా ముగియలేదని పేర్కొంటూ సీబీఐ అధికారులు మరోసారి కవితకు సీఆర్పీసీ 91 కింద నోటీసులు ఇచ్చారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి సీబీఐ ముమ్మర దర్యాప్తు చేపట్టింది. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఈ స్కాంలో పాలుపంచుకున్నారని భావిస్తున్న అధికారులు శరవేగంగా లోతుగా కూపీలు లాగుతున్నారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ కవితకు
ఇంతకుముందు సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు కేవలం కేసుకు సంబంధించిన వివరణ కోసం మాత్రమే ఇవ్వగా నిన్న ఆమె వద్ద నుంచి వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్నారు. అయితే ఇప్పుడు తాజా కవితకు సీఆర్పీసీ 91 కింద సీబీఐ అధికారులు నోటీసుల ఇచ్చినట్టు సమాచారం.

సాక్షి దగ్గర ఏమైనా కీలక ఆధారాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థ భావిస్తే ఈ విధంగా 91 సీఆర్పీసీ కింద నోటీసులు ఇస్తారు. ఈ నోటీసుల కింద సాక్షి దగ్గర కేసుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలున్నా తమకు సమర్పించాలని అధికారులు కోరే అవకాశం ఉంది. ఈ ప్రకారంగా చూసుకుంటే కవిత దగ్గర ఏవో కీలకమైన ఆధారాలు ఉన్నట్లు సీబీఐ భావిస్తోంది. 91 సీఆర్పీసీ ప్రకారం సీబీఐ చెప్పినచోట కవిత విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అడిగిన పత్రాలు, ఆధారాలు కచ్చితంగా సమర్పించాలి. ఇక ఎవరు ఈ నోటీసులు అందుకుంటే వాళ్లే హాజరు కావాల్సి ఉంటుంది. విచారణ తేదీ, స్థలం మెయిల్ ద్వారా తెలియజేస్తామని సీబీఐ నోటీసుల్లో పేర్కొంది. ఇకపోతే ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో అమిత్‌ అరోరా ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా కవిత దగ్గర ఆధారాలున్నట్లు సీబీఐ అధికారులు భావిస్తున్నారు. అయితే ఆధారాలు ఉన్నట్టయితే ఇవ్వొచ్చు, లేకపోతే లేవని చెప్పొచ్చు. అయితే సమర్పించిన ఆధారాలకు సంబంధించి అధికారులకు ఏమైనా సందేహాలుంటే మాత్రం మళ్లీ నోటీసులిచ్చి మరల విచారించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఐతే ఆధారాలు ఏంటనేది తెలియాల్సి ఉంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో సంబంధమున్న 30 మంది.. ఈ కేసుకు సంబంధించి ఆధారాలున్న 170 సెల్‌ఫోన్లను ధ్వంసం చేశారనే ఆరోపణలు వచ్చాయి. అందులో కవితకు సంబంధించిన 10 మొబైల్స్‌ కూడా ఉన్నట్లు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే సీఆర్పీసీ 91 నోటీసులపై ఎమ్మెల్సీ కవిత ఎలా స్పందిస్తారు..? సీబీఐ అడిగిన ఆధారాలను సమర్పిస్తారా..? లేదా, రెండోసారి చెప్పిన ప్లేస్‌కి విచారణకు వెళ్తారా..? లేదా కవిత నెక్ట్స్ స్టెప్ ఏంటి అనే ఉత్కంఠ నెలకొంది.

ఇదీ చదవండి: కోమటిరెడ్డిని పక్కన పెట్టేసిన కాంగ్రెస్.. తెలంగాణ పీసీసీ కొత్త కమిటీల్లో దక్కని చోటు

Exit mobile version