Lalu And Nitish Meet Sonia Gandhi: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎలాగైనా గద్దెదించాలని ప్రతిపక్షాలన్నీ సిద్దమవుతున్నాయి. విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి జాతీయ స్థాయిలో మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా బీహార్‌లో అధికార కూటమికి చెందిన ఇద్దరు అగ్రనేతలు నేడు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో సమావేశమవనున్నారు. ఆదివారం సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్, బీహార్ సీఎం నితీశ్‌కుమార్ ఢిల్లీలో భేటీకానున్నారు. గత ఐదేళ్ల కాలంలో ఈ ముగ్గురు నాయకులు భేటీ కావడం ఇదే మొదటిసారి.
ఈ భేటీ నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన రాజకీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అందులో ముఖ్యంగా జాతీయస్థాయిలో మహా కూటమిని ఏర్పాటు చేయాలనే అంశం ఉండొచ్చునని సమాచారం.
ఇకపోతే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని లాలూప్రసాద్ యాదవ్ అన్నమాట విదితమే. ఓ సభ వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆయన విరుచుకుపడ్డారు. బీజేపీని గద్దెదింపాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు పిఎఫ్ఐ కుట్ర