Airtel: 5జీ టెక్నాలజీ ఎప్పుడు అందుబాటులోకి వస‍్తుందా? అని ఎదురుచూస్తున్న ఎయిర్ టెల్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. ఐఫోన్, శాంసంగ్, వన్ ప్లస్‌తో పాటు ఇతర స్మార్ట్ ఫోన్లలో ఈ 5జీ టెక్నాలజీ పనిచెయ్యడం లేదని యూజర్లు వాపోయతున్నారు.
అక్టోబర్ 1న ప్రారంభించిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ సదస్సులో భాగంగా 5జీ సేవల్ని ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. కాగా టెలికం సంస్థ అయిన ఎయిర్ టెల్ దేశంలో ఎంపిక చేసిన ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, వారణాసి, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, సిలిగురిలో ఈ 5జీ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే తాజాగా ఈ 5జీ సేవలు అందడంలేదని ఓ పక్క యూజర్లు వాపోతుంటే, దీనిపై నిపుణులు మాత్రం ఫోన్‌లలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయ్యాలంటున్నారు.
ఆ ఫోన్లలో 5జీ పనిచేయడం లేదు
5జీ నెట్ వర్క్ పనిచేయకపోవడం ఏంటని ఎయిర్‌టెల్, ఫోన్ తయారీ సంస‍్థలు టెస్టింగ్ నిర్వహిస్తున్నాయి. కాగా యాపిల్, శాంసంగ్ సిరీస్‌లోని ఫ్లిప్ 4, ఫోల్డ్ 4, ఎస్ 21 ఎఫ్‌ఈ, గెలాక్సీ ఎస్ 22, ఎస్22 ఆల్ట్రా అండ్ ఎస్ 22, వన్ ప్లస్‌కు చెందిన వన్ ప్లస్ 8, 8టీ, 8ప్రో, 9ఆర్, నార్డ్2, 9ఆర్టీల వంటి స్మార్ట్ ఫోన్లలో ఈ 5జీ సేవలు పనిచేయడం లేదని, మిగిలిన ఫోన్‌లలో ఈ ఫాస్టెస్ట్ టెక్నాలజీని వినియోగించుకోనే సౌలభ్యం ఉందని తెలుస్తోంది.
ఇదీ చదవండి:ఈ 5జీ స్మార్ట్ ఫోన్ ధర తెలిస్తే వెంటనే బుక్ చేసుకుంటారు !