Janasena Yuvashakthi: శ్రీకాకుళం సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ప్రణాళిక వేశారని.. సుపారీ కూడా ఇచ్చారని వెల్లడించారు. రంగస్థలం సినిమాలో లానే తనను చంపేందుకు కుట్ర చేశారని పవన్ ఆరోపించారు. హత్య రాజకీయాలకు పాల్పడే వైసీపీ లాంటి పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని.. పవన్ పిలుపునిచ్చారు.
జగన్ అందిస్తున్న నవరత్నాలలో సామాన్యులకు దక్కేది కేవలం రూ. 50 అని.. వాటికి ఆశపడి యువత భవిష్యత్ నాశనం చేయవద్దని సూచించారు. గత ఎన్నికల్లో ఓట్లు చీలడం వల్లే వైసీపీ 53 నియోజకవర్గాల్లో గెలిచిందని విమర్శించారు. చంద్రబాబుని కలిస్తే.. పిచ్చి కూతలు కూస్తున్నారని. మండిపడ్డారు. రాష్ట్రాభివద్ధిపై చర్చిస్తే ప్యాకెజీ అంటారా అని పవన్ ప్రశ్నించారు.
చంద్రబాబుతో సీట్ల గురించి మాట్లాడలేదని.. రాష్ట్రంలో వైసీపీ నీచ పాలనపై చర్చించినట్లు తెలిపారు.
వైసీపీ నేతలకు పిచ్చి కూతలు కూయడం తప్పా రాష్ట్రాభివృద్ధి పట్టదని అన్నారు.
రాష్ట్రాన్ని జగన్ చక్కగా పాలిస్తే.. చప్పట్లు కొడతానని పవన్ పేర్కొన్నారు.
తాను కోరుకునేది అధికారం కాదని.. రాష్ట్ర భవిష్యత్ మాత్రమేనని సభాముఖంగా పవన్ తెలిపారు. రాష్ట్రాన్ని ఎవరు పాలించిన సామాన్యులకు కష్టాలు లేకుండా.. చూడాలని కోరారు. వైసీపీ నాయకులు ఎన్ని మాటలన్నా.. వారు ఎదురుపడితే నమస్కారం పెడతా.. అది నా సంస్కారం అని అన్నారు. తాను రాష్ట్ర ప్రజల కోసం కోట్లు వదులుకున్నానని.. సత్తా ఉంటే రోజు కోటి సంపాదించగలనని అన్నారు. ప్రజలను నమ్మి రాజకీయాల్లోకి వచ్చానని.. చివరకు ప్రజలే తనను మోసం చేశారని పవన్ కళ్యాణ్ తెలిపారు.
నా కుటుంబమే నా కోసం నిలబడకపోతే నేనేం చేయగలను?. రాష్ట్ర ప్రజలంతా తన కుటుంబంతో సమానమని పవన్ పేర్కొన్నారు. తనకు అధికారం ఉన్నా లేకున్నా.. పదేళ్లు రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు. రాజకీయం తనకు సరదా కాదని.. ఓ బాధ్యత అనుకొనే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. ప్రజలు గెలిపిస్తానని మాటిస్తే.. ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తా అని చెప్పారు. కొన్ని సందర్భాల్లో శత్రువులైనా సరే కలిసి వెళ్లాల్సిందే అన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇస్తే.. రాష్ట్రం మెుత్తాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని పవన్ భరోసా ఇచ్చారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని.. పరిశ్రమలు నెలకొల్పుతామని వలసలు లేకుండా చేస్తామన్నారు. అధికారం ఇస్తే సేవకుడిగా రాష్ట్ర ప్రజలకు సేవా చేస్తానని పవన్ కోరారు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/