Ram Charan: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మార్చి 25 వ తేదీ విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా రికార్డులు సృష్టించిందని చెప్పాలి. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో సందడి చేశారు. అలానే బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలివియా హీరోయిన్లుగా నటించగా… అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని కీలక పత్రాలు పోషించారు.
ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్
కాగా తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకి దేశవిదేశాలనుంచి ప్రశంశలు దక్కాయి. ఇప్పటికే ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన ఈ సినిమా పలు అంతర్జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు బరిలో నిలిచిన ఈ సినిమా బెస్ట్ సాంగ్ కేటగిరీలో అవార్డును కైవసం చేసుకుంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకి అవార్డు రావడం పట్ల పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. ఇది తెలుగు ప్రేక్షకులు గర్వించదగ్గ విషయం అని అంటూ ఇలానే ఆస్కార్ అవార్డుల్లో కూడా ఆర్ఆర్ఆర్ సత్తా చాటాలని కోరుకుంటున్నారు.
మరోవైపు ఈ అవార్డు వేడుకల్లో భాగంగా మూవీ టీం హాలీవుడ్ మీడియాతో ముచ్చటించారు. అమెరికన్ యాక్సెంట్ లో రామ్ చరణ్(Ram Charan) చక్కగా మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ సినిమా విశేషాలను పంచుకుంటూ మీడియాతో చరణ్ మాట్లాడిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది. దీంతో మెగా అభిమనులంతా చరణ్ మాట్లాడిన వీడియోని షేర్ చేస్తూ మెగాస్టార్ కి తగ్గ తనయుడుచరణ్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ఆ యాక్సెంట్ లో చరణ్ మాట్లాడే సమయంలో తళుక్కున వెనుకే తన భార్య ఉపాసన మెరవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సోషల్ మీడియా వ్యాప్తంగా చరణ్ అభిమనులంతా ఆ వీడియోని షేర్ చేస్తూ మెగా పవర్ స్టార్ అదరగొట్టేశాడు అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. మొత్తంగా ఆకార తర్వాత అంతటి స్థాయిని కలిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుని ఆర్ఆర్ఆర్ సొంతం చేసుకోవడం తెలుగు సినిమా స్థాయిని పెంచే విషయం అని చెప్పాలి.
ఇవి కూడా చదవండి:
సైలెంట్‌గా ఉపాసన ఎంట్రీ.. భార్యను రాంచరణ్ ఎలా పరిచయం చేశాడో చూడండి..
ఈ ఏడాది హాట్ స్టార్ కి షాక్.. ఆ ఓటీటీలో ఐపీఎల్ స్ట్రీమింగ్.. ఎన్ని భాషల్లో అంటే?
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో సత్తా చాటిన ఆర్ఆర్ఆర్.. బెస్ట్ సాంగ్ గా “నాటు నాటు”
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/