Site icon Prime9

Unstoppable Show : బాలకృష్ణ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఈ దెబ్బకు థింకింగ్ మారిపోద్ది

pawan-kalyan-participate-in-balakrishna-unstoppable-talk-show-shoot

pawan-kalyan-participate-in-balakrishna-unstoppable-talk-show-shoot

Unstoppable Show : నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌ చేస్తోన్న అన్ స్టాపబుల్ టాక్‌ షో కి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది. ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ టాక్ షో అత్యధిక టీఆర్పీలతో రికార్డులను తిరగరాస్తుంది. సీజన్ 1 ని విజయవంతంగా కంప్లీట్ చేసిన బాలయ్య… సీజన్ 2 ని కూడా అంత కంటే ఎక్కువ ఊపులో కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ సీజన్ లో పలువురు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు షో లో పాల్గొన్నారు. కాగా పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ కూడా గెస్ట్ గా వచ్చారు. ఇక ఇప్పుడు అదే జోష్ లో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్ కూడా ఈ షోలో పాల్గొనబోతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఆరు ఎపిసోడ్స్ అవ్వగా ఏడో ఎపిసోడ్ గా ప్రభాస్, గోపీచంద్ రానున్నారు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 30న స్ట్రీమ్ అవ్వనుంది. ఇప్పటికే అభిమానులు, ప్రేక్షకులు ప్రభాస్ – బాలయ్య ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సారి ఏకంగా పవర్ స్టార్ ని కూడా గెస్ట్ గా తీసుకు రావడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రి గా మారింది. కాగా ఈ మేరకు డిసెంబర్ 27న అన్‌స్టాపబుల్ పవన్, బాలయ్య ఎపిసోడ్ షూట్ జరగనుంది. అన్నపూర్ణ స్టూడియోలో ఈ షూట్ జరగనుండగా… దీంతో బాలయ్య అభిమానులు, పవన్ అభిమానులు స్టూడియో వద్దకి భారీగా చేరుకొని నినాదాలు చేస్తున్నారు.

జై బాలయ్య, జై పవర్ స్టార్ అంటూ అభిమానులు స్టూడియో బయట ఓ రేంజ్ లో హంగామా చేస్తున్నారు. దీంతో షూట్ కూడా అవ్వకుండానే పవన్ – బాలయ్య ఎపిసోడ్ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ఎపిసోడ్ లో ఏం మాట్లాడతారు? సినిమాలతో పాటు రాజకీయాలు కూడా మాట్లాడతారా అని ఇటు సినిమా రంగంతో పాటు అటు రాజకీయాల్లో కూడా చర్చ మొదలైంది. కాగా ఈ మేరకు తాజాగా అన్నపూర్ణ స్టూడియో వద్ద అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. ఈ ఎపిసోడ్ తో అన్ స్టాపబుల్ షో మరింత రేంజ్ కి వెళ్తుందని అన్నారు. షో కి రావడానికి ఒప్పుకున్న పవన్ కళ్యాణ్ కి థాంక్స్ అంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

 

Exit mobile version