Veera Simha Reddy: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. శృతిహాసన్, హనీ రోజ్ బాలయ్యకి జంటగా నటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ నటించిన చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే, పక్కా మాస్ కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందని.. అభిమానులకు అయితే పండగ లాంటి సినిమా అని అంటున్నారు.
థియేటర్లలో దుమ్మురేపుతున్న ప్యాన్స్..
ఇదిలా ఉంటే, ‘వీరసింహారెడ్డి’ సినిమా విడుదల సందర్భంగా ఏపీలోని చాలా ఏరియాల్లో థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపించింది. ఈరోజు తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్ద బాలయ్య అభిమానులు హడావిడి చేశారు. కాగా సినిమా చూసిన అభిమానులు బాలయ్య జాతర మొదలైంది అంటున్నారు. హై వోల్టాజ్ యాక్షన్ సీన్స్ తో పాటు సెంటిమెంటల్ ఎమోషన్ సీన్స్ కూడా ఉన్నాయి. దీంతో ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా నచ్చుతుంది అని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూవీని మరో స్థాయికి తీసుకెళ్లింది.
స్టెప్పులతో రచ్చ చేసిన తాత
కాగా హైదరాబాద్ లోని ఓ ప్రముఖ థియేటర్లో ఈరోజు బాలకృష్ణ అభిమానుల్లో ఓ తాత చేసిన సందడి సోషల్ మీడియాలో ఇప్పుడు హైలైట్ గా మారింది. బాలయ్య పాటకు అదిరిపోయే రేంజ్ లో థియేటర్లోనే స్టెప్పులు వేసి రచ్చ రచ్చ చేశాడు. ఆ పెద్దాయన డాన్స్ వీస్తూంటే యూత్ అంతా ఆయనను సపోర్ట్ చేస్తూ ఈలలు, కేకలు వేస్తూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్ గా మారింది. కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో వేసిన ఈ స్పెషల్ షోలో నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. దర్శకుడు గోపీచంద్ తో కలిసి థియేటర్ కు వచ్చిన బాలయ్య అభిమానులతో కలిసి సినిమాను వీక్షించారు. బాలయ్య రాకతో థియేటర్ వద్ద సందడి నెలకొంది. మాస్ ఎంట్రీతో వచ్చిన బాలయ్యకు నందమూరి ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాలలో వీర సింహారెడ్డి మానియా నడుస్తుంది.
ఇవీ చదవండి
Veera Simha Reddy: అప్పుడు తొడకొడితే రైలు వెనక్కి.. ఇప్పుడు తంతే కారు వెనక్కి.. బాలయ్యకు లాజిక్‌లు ఉండవ్..
Jagan vs Adnan Sami: అద్నాన్ సమీ vs వైసీపీ మంత్రులు.. తెలుగు జెండా వివాదం ఏంటి?
Somesh Kumar: ఏపీ ప్రభుత్వానికి సోమేశ్ కుమార్ రిపోర్ట్.. సీఎం జగన్ తో భేటీ
Vande Bharat Express: విశాఖలో వందేభారత్ ఎక్స్ ప్రెస్ బోగీలపై రాళ్లదాడి
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/