Site icon Prime9

Kadiyam Srihari : జగన్ జైలుకు పోతే నీకు అవకాశం.. సమయాన్ని వృధా చేసుకోకు అంటూ షర్మిలకు కౌంటర్ ఇచ్చిన.. కడియం శ్రీహరి

mlc kadiyam srihari shocking comments on ya sharmila and ap cm jagan

mlc kadiyam srihari shocking comments on ya sharmila and ap cm jagan

Kadiyam Srihari : దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. వైఎస్ షర్మిలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బడ్జెట్‌పై షర్మిల చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

షర్మిలను చూస్తే జాలి వేస్తుందని కడియం వ్యాఖ్యానించారు.

ముందు నుంచి తెలంగాణకు వైఎస్ కుటుంబం వ్యతిరేకమని ఆయన అన్నారు.

తెలంగాణ బిల్లుని ప్రతిపాదించినప్పుడు జగన్ సమైక్యాంధ్ర కావాలని కోరినట్లు గుర్తు చేశారు.

జగన్ జైలు కెళ్లినప్పుడు విజయలక్ష్మి, షర్మిల పాదయాత్రలు చేపట్టి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు.

జగన్.. షర్మిల, విజయలక్ష్మికి రాజకీయంగా అన్యాయం చేశారని తెలిపారు.

ఈ విషయాలపై ఆంధ్రకు వెళ్లి ప్రజలకు మొర పెట్టుకోవాలని సూచించారు.

రెపో మాపో జగన్ జైలుకు పోతే ఆమెకు అవకాశం వస్తుందని.. ఇక్కడ తిరిగి సమయం వృధా చేసుకోవద్దని షర్మిలకు కడియం శ్రీహరి సూచించారు.

కేంద్ర బ‌డ్జెట్‌లో తెలంగాణ‌కు ఒరిగిందేమీ లేదు అన్న క‌డియం.. రాష్ట్ర బ‌డ్జెట్ సంక్షేమ బ‌డ్జెట్ అని ప్రశంసించారు.

 

 

కాగా అంతకు ముందు బడ్జెట్‌పై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

కొత్త సీసాలో పాత సార పోసినట్లుగా బడ్జెట్ఉందంటూ ఎద్దేవా చేశారు.

ఆర్ధిక మంత్రి హరీష్ రావు కొత్త సీసా తీసుకొని ఫామ్‌హౌజ్‌కి వెళ్లారని.. అందులో కేసీఆర్ పాత సార పోశారంటూ సెటైర్లు సంధించారు.

బడ్జెట్‌లో కొత్తగా ఏమీ లేదని ఆమె విమర్శించారు.

గత ఏడాది బడ్జెట్‌నే ఈ ఏడాది కాపీ పేస్ట్ చేశారని వ్యాఖ్యానించారు.

గత బడ్జెట్ కేటాయింపులు మాదిరిగా ఈ సారి కూడా అంకెలు చూపించారని షర్మిల విమర్శించారు.

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.

 

 

వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి బరిలో దిగనున్న వైఎస్ షర్మిల..

 

మరోవైపు తెలంగాణలో షర్మిల పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే.

కొన్ని రోజుల ముందు నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తల దాడులు చేయడంతో ఆమె పాదయాత్ర నిలిచిపోయింది.

అనంతరం షర్మిల హైకోర్టుకు వెళ్లి పాదయాత్రకు అనుమతి తెచ్చుకున్నారు.

నర్సంపేట నియోజకవర్గం, చెన్నారావు పేట మండలం శంకరమ్మ తండా వద్ద నుంచి మళ్లీ ప్రారంభించారు.

ఈ నెలాఖరు కల్లా పెండింగ్‌ నియోజకవర్గాల్లో పాదయాత్రను పూర్తి చేసి మహబూబాబాద్‌ నియోజకవర్గం మీదుగా పాలేరు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు.

ప్రజాప్రస్థానం ముగింపు సభ ఖమ్మం రూరల్‌ మండలంలో జరగనుంది.

వచ్చే ఎన్నికల్లో షర్మిల పాలేరు నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

రెండో సారి పాదయాత్ర ప్రారంభించిన తర్వాత కూడా పలు చోట్ల పాదయాత్ర రూట్‌లో ఆమె ఫ్లెక్సీలు చించి వేయడంతో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.

పాదయాత్రను ఎవరూ అడ్డుకోలేరని చెబుతూ షర్మిల పాదయాత్రని కొనసాగిస్తున్నారు.

ఇటీవలి కాలంలో ఆమె బీఆర్ఎస్ పై ఘాటు విమర్శలు చేస్తున్నారు.

ప్రస్తుతం షర్మిల, సీఎం జగన్ పై కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో  సంచలనంగా మారాయి.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version