Pawan Kalyan : వైసీపీ ఓడిపోతోంది.. జగన్‌కు కూడా ఆ విషయం తెలుసు : పవన్ కళ్యాణ్

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్‎లోని చంద్రబాబు ఇంట్లో ఆయన సమావేశమయ్యారు. ఈ మేరకు వారి భేటీ అనంతరం మెడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

  • Written By:
  • Updated On - January 8, 2023 / 03:39 PM IST

Pawan Kalyan : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్‎లోని చంద్రబాబు ఇంట్లో ఆయన సమావేశమయ్యారు. ఈ మేరకు వారి భేటీ అనంతరం మెడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఫ్లెక్సీలు వాడకూడదు అన్నారు.. కానీ జగన్ పుట్టిన రోజుకు మాత్రం యూనివర్శిటీల్లో కూడా వేశారు. రూల్ అందరికీ అంటారు.. కానీ, యంత్రాంగం వాళ్ల చేతుల్లో ఉంది. కోవిడ్ లో ఎన్నో దారుణాలు చేశారు. అందరినీ ఇళ్లలో పెట్టి వీళ్లు మాత్రం పుట్టిన రోజులు, తిరునాళ్లు చేసుకున్నారు.

ఇవాళ తాను ప్రత్యేకించి చంద్రబాబును కలవడానికి ముఖ్య కారణం మొన్న కుప్పంలో జరిగిన సంఘటన అని వెల్లడించారు. వైసీపీ అరాచకాలు, చంద్రబాబును తిరగనివ్వకపోవడం, ఆయనను ప్రజల వద్దకు వెళ్లనివ్వకపోవడం, ఆయన హక్కులను కాలరాయడం, కేసులు పెట్టడం వంటి ఘటనలను చూసి, వాటిపై మీడియా ప్రకటనలు కూడా ఇచ్చానని పవన్ వెల్లడించారు. కుప్పంలో జరిగిన సంఘటనకు సంబంధించి నేడు చంద్రబాబును కలిసి సంఘీభావం తెలిపేందుకు వచ్చానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన, పెన్షన్లు తొలగింపు, ఫీజు రీయింబర్స్ మెంట్, శాంతిభద్రతలు లోపించడం, రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రభుత్వానికి తన బాధ్యతలను గుర్తుచేయడం వంటి అంశాల గురించి తామిరువురం విస్తృతంగా చర్చించుకున్నామని పవన్ వెల్లడించారు.

ప్రత్యర్ధి పార్టీలను అడ్డుకునేందుకు చెత్త జీవోలు ఆపాలి..

ప్రజలకు వద్దకు వెళ్లి వాళ్ల సమస్యలపై మాట్లాడనివ్వకుండా ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి చట్టం తీసుకురావడం, ప్రత్యర్థి పార్టీలను అడ్డుకునేందుకు ఇలాంటి చెత్త జీవోలు తీసుకురావడాన్ని ఆపాలని బలంగా నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ జీవో తీసుకురావడానికి ముందే తనను వైజాగ్ లో అడ్డుకున్నారని, వాహనంలోంచి దిగకూడదు, ప్రజలకు అభివాదం చేయకూడదు, గదిలోంచి బయటకు రాకూడదు అని ఆంక్షలు విధించారని పవన్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటును మాత్రం చీల్చనివ్వనని పవన్ చెప్పారు. వైసీపీ ఓటమి ఖాయం అని అ విషయం జగన్ కి కూడా తెలుసని అన్నారు. ప్రస్తుతం పవన్, చంద్రబాబు భేటీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఇవి కూడా చదవండి..

Hyderabad Costly Dog: హైదరాబాద్‌లో రూ. 20 కోట్ల విలువైన కుక్క.. ఇందులో నిజమెంత..?

Gudivada Amarnath: బాలయ్య బాబు కాదు తాత- గుడివాడ అమర్నాథ్ ఘాటు విమర్శలు

Pawan Kalyan : ఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టించిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/