Site icon Prime9

Hyderabad Costly Dog: హైదరాబాద్‌లో రూ. 20 కోట్ల విలువైన కుక్క.. ఇందులో నిజమెంత..?

Hyderabad costliest dog

Hyderabad costliest dog

Hyderabad Costly Dog: కుక్కకు 20 కొట్లట? నిన్నటి నుంచి సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్న న్యూస్ ఇది. సోషల్ మీడియానే కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ వార్తను హైలైట్ చేస్తోంది. నిజంగానే ఒక కుక్క ధర రూ. 20 కోట్లు ఉంటుందా? ఇలా కూడా ఆఫర్స్ ఇస్తారా? ‘హైదరాబాద్‌లో 20 కోట్ల కుక్క’పై ఫ్యాక్ట్ చెక్..

సాధారణంగా ఒక కుక్కను కొనాలంటే దాని ధర ఎంత ఉంటుంది.. మహా అయితే రూ. 50 వేలు, ఓ లక్ష రూపాయలో ఉంటుంది. బాగా ఖరీదైనదంటే రూ. 5 లక్షలు, పదిలక్షలు ఇంకా అరుదైన జాతి కుక్క కావాలంటే కోటి రూపాయల దాకా ఉంటుందేమో.. కానీ, హైదరాబాద్‌లో ఒక కుక్కను రూ. 20 కోట్లకు అమ్మారని పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

ఆ మీడియా కథనాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఒక వ్యక్తి దగ్గర నుంచి రూ.20 కోట్లు చెల్లించి ఒక కుక్కను కొన్నాను అంటూ బెంగళూరుకు చెందిన సతీశ్ అనే వ్యక్తి చెప్పాడు. దీంతో హైదరాబాద్‌లో రూ. 20 కోట్ల (Hyderabad Costly Dog) కుక్క అని గూగుల్‌లో కూడా చాలామంది వెదకటం మొదలు పెట్టారు. స్థానికంగా ఉండే పత్రికలే కాదు ఎన్డీటీవీ, ఎకనామిక్ టైమ్స్ వంటి మీడియా సంస్థలు కూడా ఈ వార్తను ప్రచురించాయి.

ఇంతకీ నిజం ఏంటంటే..

హైదరాబాద్‌లో అసలు ఇలాంటి డీల్ ఏదీ జరగలేదు. బెంగళూరులో కూడా జరగలేదు. అసలు కుక్క కోసం20 కోట్ల డీలే జరగలేదు.

మరి ఇదంతా ఎలా మొదలైంది?

ప్రైమ్9న్యూస్ ఫ్యాక్ట్ చెక్ ప్రకారం.. ఈ వార్త తొలుత బెంగళూరు మిర్రర్ అనే పత్రికలో పబ్లిష్ అయ్యింది.
టైమ్స్ గ్రూప్‌కు చెందిన ఈ పత్రికలో కుక్క ఫొటోతో పాటు బెంగళూరుకే టాప్ కుక్క ఇదే, రూ. 20 కోట్లకు డీల్ అనే హెడ్‌లైన్‌తో పెద్ద వార్తనే ప్రచురించారు. ఆ తర్వాత కన్నడ, తెలుగు, తమిళం, మళయాళం, హిందీ, ఇంగ్లీష్ ఇలా అన్ని భాషల మీడియాలూ దీనిని ప్రచురించేశాయి. సతీశ్ అనే ఆ వ్యక్తి ఈ కథనాలన్నింటినీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పెట్టుకున్నాడు. హైదరాబాద్‌లో కుక్కల్ని పెంచే వ్యక్తి దగ్గర్నుంచి ఈ కుక్కను రూ.20 కోట్లకు కొన్నానని ఆయన చెప్పినట్లు ఈ కథనాలన్నింటిలోనూ ఉంది.

సీన్ రివర్స్..

అయితే, 20 కోట్ల డీల్ మీద పెద్ద ఎత్తున మీడియాలో కథనాలు రావడంతో ఐటీ రైడ్స్ జరుగుతాయనుకున్నారో, మరేమైందో తెలియదు కానీ.. అదే సతీశ్ ఇప్పుడు వేరే స్టోరీ చెబుతున్నారు. వాస్తవానికి ఆ కుక్క తనదేనని, రూ.20 కోట్లకు దానిని అమ్మాలని హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి తనను సంప్రదించారని.. అయితే రూ.100 కోట్లు ఇచ్చినా దానిని ఇవ్వను అని చెప్పానని అంటున్నారు. దీంతో 20 కోట్లకు కుక్కను ఎవరూ కొనలేదు, ఎవరూ అమ్మలేదు అనే విషయం మాత్రం స్పష్టమైంది. అసలు విషయం తెలుసుకోకుండా మీడియా అంతా అత్యుత్సాహంతో స్టోరీలు పబ్లిష్ చేసేశాయని కూడా తేలిపోయింది.

ఈ కుక్క కథ ఏంటి?

బెంగళూర్ కి చెందిన ఎస్. సతీష్ అనే ఈయన ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్‌ని అని చెప్పుకుంటున్నాడు. కుక్కలను పెంచుకోవడం తనకు అత్యంత ఇష్టమైన హాబీ అని కూడా చెబుతున్నాడు. ఈ కుక్కకు సతీశ్ పెట్టుకున్న ముద్దు పేరు కాడబోమ్స్ హాయిడెర్. కాకసియాన్ షెఫర్డ్ జాతికి చెందిన ఈ కుక్క చాలా అరుదైనదే.
కేవలం ఒకటిన్నర సంవత్సరం వయసున్న ఈ కుక్క బరువు 100 కిలోలు.. అంటే దాదాపు ఒక ఆడ సింహం బరువుతో సమానం. ఈ కుక్క తల 38 ఇంచులు, భుజాలు 34 ఇంచులు ఉంటాయి. ఇక కుక్క పాదం విషయానికి వస్తే 2 లీటర్ల పెప్సీ బాటిల్ అంత ఉంటుంది. ఈ అరుదైన జాతికి చెందిన కుక్కలు ఎక్కువగా జార్జియా, టర్కీ, అర్మేనియా, అజర్బైజాన్ రష్యా వంటి ప్రాంతాలలో లభిస్తాయి. ఇవి భారత్ లో కనిపించడం అత్యంత అరుదు. త్రివేండ్రంలో జరిగిన పోటీలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది, బెస్ట్ బ్రీడ్ డాగ్ గా 32 మెడల్స్ సాధించడం గమనార్హం.

ఇవీ చదవండి: 

Mekapati Chandrasekhar Reddy: నాకు ఇద్దరు పెళ్లాలు ఉన్నారు.. మూడో పెళ్లాం లేదు

Nadendla Manohar: మంత్రి అప్పలరాజుకు జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఓపెన్ ఛాలెంజ్.. ఏంటంటే..?

Minister Roja : అప్పుడు లేవని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది అంటూ నాగబాబుకి బదులిచ్చిన ఇచ్చిన మంత్రి రోజా

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version