Site icon Prime9

Sharwanand: హీరో శర్వానంద్‌ కు రోడ్డు ప్రమాదం.. బోల్తా పడిన రేంజ్ రోవర్

sharwanad

sharwanad

Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఫిల్మ్ నగర్ లోని జంక్షన్ వద్ద.. అదుపుతప్పిన రేంజ్ రోవర్ బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న బైక్ ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో శర్వాకి స్వల్పగాయాలు అయినట్లు తెలుస్తోంది.

బోల్తా పడిన కారు.. (Sharwanand)

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఫిల్మ్ నగర్ లోని జంక్షన్ వద్ద.. అదుపుతప్పిన రేంజ్ రోవర్ బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న బైక్ ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో శర్వాకి స్వల్పగాయాలు అయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం శర్వానంద్ బాగానే ఉన్నారని తెలుస్తోంది. కారులో అధునాతన ఫీచర్స్ ఉండటం వల్లే.. ప్రమాదం తప్పిందని సమాచారం. ఈ ఘటనపై ఇప్పటివరకు.. శర్వానంద్ కుటుంబ సభ్యులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న శర్వానంద్ ఇటీవల తన ప్రియురాలు రక్షిత రెడ్డితో ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నారు.

కొద్ది రోజుల్లోనే వీరిద్దరి వివాహం రాజస్తాన్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. పెళ్లి భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో శర్వానంద్‌కు ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

స్పందించిన శర్వానంద్ టీమ్..

ఈ రోడ్డు ప్రమాద ఘటనపై.. ఆయన టీమ్ స్పందించింది. ఇందులో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపింది. శర్వానంద్ అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తొలుత శర్వానంద్ కి తీవ్ర గాయాలైనట్లు ప్రచారం సాగింది. అలాంటిదేమి లేదని.. టీమ్ తెలిపింది.

Exit mobile version
Skip to toolbar