Site icon Prime9

SJ Surya : ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ నా ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నా – ఎస్ జె సూర్య

director sj surya wishes to pawan kalyan and video goes viral

director sj surya wishes to pawan kalyan and video goes viral

SJ Surya : ప్రస్తుతం తాజాగా పవన్ కళ్యాణ్ పేరు సోషల్ మీడియా వేదికగా మారుమోగుతుంది. సాధారణంగానే పవన్ కి సంబంధించి ఏదైనా విషయం ఉందంటే ఆయన ఫ్యాన్స్ ఎంత రచ్చ చేస్తారో తెలిసిందే. ఇక ఇప్పుడు ఒకేసారి రెండు విషయాలు కలిసి రావడంతో పవన్ పై అభిమానాన్ని చూపేందుకు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ చెలరేగుతున్నారు. దీంతో పవన్ అభిమానుల దెబ్బకి సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది అని చెప్పాలి. ఇందుకు ఇప్పుడు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..

ఒక వైపు సినీ రంగంలో 27 ఏళ్ళ ప్రయాణం పూర్తి చేసుకున్నాడు పవర్ స్టార్. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి మూవీతో వెండి తెరకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ.. అభిమాన సముద్రాన్ని సొంతం చేసుకున్నాడు. మరోవైపు   జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లో కూడా అడుగుపెట్టిన పవన్.. అందులోనూ 10 ఏళ్లు పూర్తి చేసుకోవడం గమనార్హం. కాగా ఇందుకు సంబంధించి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పవన్ కి అభినందనలు తెలుపుతున్నారు. వారిలో దర్శకులు ఎస్ జె సూర్య, కె . రాఘవేంద్రరావు, మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల, ప్రొడ్యూసర్ ఏఎం రత్నం, ఆనంద్ సాయి అభినందనలు తెలుపుతున్నారు.

ఎస్ జె సూర్య (SJ Surya) ఏమన్నారంటే..

పవన్ కళ్యాణ్ ఖుషీ మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలుసు. ఈ సినిమాతో తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య టాలీవుడ్ డెబ్యూట్ ఇచ్చాడు. ఆ తరువాత వీరిద్దరి కలయికలో పులి సినిమా కూడా వచ్చింది. సినిమాలు పక్కన పెడితే వ్యక్తిగతంగా వీరిద్దరూ మంచి స్నేహితులు. పవన్ అంటే తనకి చాలా ఇష్టం అంటూ ఎస్ జె సూర్య చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి పవన్ పై తన అభిమానాన్ని తెలియజేశాడు.

ఆ వీడియో లో సూర్య మాట్లాడుతూ.. ”పవన్ కళ్యాణ్ అనేది ఒక పేరు కాదు, అది ఒక నమ్మకం. పవన్ కళ్యాణ్ గారు సినిమా తెరపైనే కాదు పొలిటికల్ గాను ఒక గ్రేట్ లీడర్. ప్రజలు కోసం మీరు చేసే పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం పవన్ కళ్యాణ్ నా ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకునే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఇది కేవలం నా ఒక్కడి కల మాత్రమే కాదు, ఎంతోమంది కల కూడా. ఇలాంటి ఆశీర్వాదాలు చాలా తక్కువమందికి దొరుకుతుంది. తమిళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ మరియు రాజకీయాల్లో గ్రేట్ లీడర్ ఎంజీఆర్ కూడా అలాంటి వ్యక్తే. పవన్ గారు గురించి నేను ఎప్పుడు మాట్లాడినా, నాకు ఎంజీఆర్ గారే గుర్తుకు వస్తారు. సినిమాల్లో చరిష్మా, రాజకీయాల్లో వాళ్ళ ఆలోచనలు అవన్నీ పుట్టకతో వస్తాయి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

జనసేన పార్టీ ఆవిర్బవించి 9 ఏళ్లు పూర్తయ్యి..  పదో ఏడాదిలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు కృష్ణాజిల్లా మచిలీపట్నాన్ని వేదికగా ఎంచుకున్నారు. ఈ నెల 14న బందరులో భారీ ఎత్తున బహిరంగసభ నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version