Bandi Sanjay : గతంలో ఏపీ వాళ్లను కేసీఆర్ అవమానించలేదా ? వచ్చిన వాళ్ళకి అయిన బుద్ది ఉండాలి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. తాజాగా నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నిన్న సీఎం కేసిఆర్ కొంత మంది ఆంధ్ర లీడర్ల ను బలవంతంగా పట్టుకొచ్చాడు. ఇక్కడ ఉన్న ఆంధ్ర ఓటర్లను నమ్మించి ఓట్లు వేయించుకోవడం సీఎం కేసీఆర్ కి తెలిసిన విద్య అని బండి సంజయ్ విమర్శించారు.
ఒక పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఉంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తారు. కానీ, బీఆర్ఎస్ కు ఇప్పటి వరకు జాతీయ అధ్యక్షుడే లేడు. జాతీయ అధ్యక్షుడు లేకుండానే రాష్ట్ర అధ్యక్షుడిని ఎలా ప్రకటిస్తారో నాకు అర్ధం కాలేదు. సొంత రాష్ట్రంలోనే పార్టీ అధ్యక్షుడిని ప్రకటించలేదు… కానీ, పక్క రాష్ట్రానికి అధ్యక్షుడిని ప్రకటించారు. కేసిఆర్ 2014 లో ఆంధ్ర వాళ్ళని తిట్టి జై తెలంగాణ అన్నారు.
తెలంగాణ ఏర్పడక ముందు 18లక్షల వ్యవసాయ బోర్లు ఉంటే.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 23 లక్షల బోర్లు ఉన్నాయి. పాఠశాల విద్యలో తెలంగాణ 21వ స్థానంలో ఉంది. నిరుద్యోగంలో తెలంగాణ 4వ స్థానంలో ఉంది. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ 5వ స్థానంలో ఉంది. యువతను భాజపాకు దూరం చేసేందుకే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నారు” అని బండి సంజయ్ ఆరోపించారు. రైతులకు ఉచిత విద్యుత్ గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారా ? విశాఖ ఉక్కు గురించి మాట్లాడుతున్నారు… తెలంగాణలో నిజాం చక్కెర పరిశ్రమను ఎందుకు పునరుద్ధరించటం లేదు. రాష్ట్రంలో విద్యుత్ఛార్జీలు పెంచింది నిజం కాదా ? కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నీట మునిగింది నిజం కాదా ? ఏపీ సీఎంతో కుమ్మక్కై కేఆర్ఎంబీ సమావేశానికి కేసీఆర్ వెళ్లట్లేదని సంజయ్ ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్టుపై మీ వైఖరి ఏమిటి ? పోలవరం ఎత్తు పెంచాలో, తగ్గించాలో కేసీఆర్ చెప్పాలి. ఓట్లు అయిపోయాక నీళ్ల వాటా పేరుతో ఏపీ, తెలంగాణ అని మళ్లీ రెచ్చగొడతారని విమర్శించారు. కనీసం నిన్న సభలో కేసీఆర్ జై తెలంగాణ నినాదం చేయలేదు. రాష్ట్రం ఏర్పడ్డాక బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మిస్తాని అన్నావు. ఆర్టీసీ ఆస్తులు అమ్ముకొని ప్రైవేట్ భూములు కబ్జా చేస్తున్నావ్. 24 గంటల కరెంట్ ను రాష్ట్రంలో ఎక్కడ ఇస్తున్నారు డిస్కాం లను నష్టాల్లోకి నెట్టావు. పొలం దగ్గర ఫ్రీ కరెంట్ ఇచ్చి ఇంటి దగ్గర ఛార్జీలు పెంచుతున్నవు. నీకేం తెలివి ఉంది. కాళేశ్వరం తో ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు? కృష్ణ జలాల విషయంలో 575టిఎంసిలో 299 టీఎంసీ లకు మాత్రమె సంతకం పెట్టావు. 299టీఎంసీ లో ఎంత వాడుతున్నవు. నేను లేఖ రాసినంత వరకు రాయలసీమ ఎత్తిపోతల మీద మాట్లాడలేదు అని బండి సంజయ్ ఫైర్ అయ్యారు.
మెక్ ఇన్ ఇండియా ద్వారానే కదా వాక్సిన్ తయారు చేశాం. ఆయుధాలను తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. కేసిఆర్ ఇంకా 2014 లో ఉన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఓపెన్ చేసాం. యువత బీజేపీ వైపు ఉన్నారు. ఎన్నికల ముందు వారిని నోటిఫికేషన్స్ తో బిజీగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. కేసిఆర్ డిఎన్ఏ తేడాగా ఉందని డౌట్ అందుకే ప్రతిసారీ చైనా, జింబాబ్వే, అని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గుజరాత్ అభివృద్ధి చేశాం కాబట్టే 7సార్లు అధికారంలోకి వచ్చాం. విద్యుత్ ఉద్యోగుల పరిస్థితి ఎంటి? స్టువర్ట్ పురం, దండుపాళ్యం దొంగల ముఠా ల గ్రామ పంచాయతీ నిధులను దోచుకుంటున్నారు. గ్రామ పంచాయతీ నిధులను దొంగిలించిన దొంగవు కేసిఆర్. గ్రామ పంచాయతీ నిధులు అకౌంట్ లో తిరిగి వేసే వరకు పోరాడతాము అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.