Site icon Prime9

Golden Rock: మిస్టరీగా మిగిలిన గోల్డెన్ రాక్.. మహిళలు ముడితే అంతే సంగతి..!

myanmar-kyaiktiyo-pagoda-women-cannot-touch-this-mysterious-golden-stone

myanmar-kyaiktiyo-pagoda-women-cannot-touch-this-mysterious-golden-stone

Golden Rock: ప్రపంచంలో ఎన్నో మర్మప్రదేశాలు ఉన్నాయి వాటిలో ఇప్పటికీ సైంటిస్టులకు అందని, అంతుచిక్కని రహస్యాలు ఎన్నో దాగున్నాయి. అటువంటి వాటిల్లో ఒకటి తమిళనాడు మహాబలిపురంలో ఒక కొండపై ఏటవాలుగా, జారిపోయేలా ఉన్న రాయి కూడా ఉంది. దీనిలో విశేషమేమంటే ఎంత పెద్ద తుఫాను వచ్చినా ఈ రాయిమాత్రం ఇసుమంతైనా కదల్లేదని అక్కడి స్థానికులు అంటున్నారు.

ఇక ఇదే తరహాలో మయన్మార్‌లో కూడా ఒక రాయి ఉంది. ఈ రాయి దాదాపు 25 అడుగుల ఎత్తు ఉంటుంది. 1100 మీటర్ల ఎత్తున్న ఈ భారీ బండరాయిని ‘కాయక్తియో పగోడా’, ‘గోల్డెన్ రాక్’ అనే పేర్లతో పిలుస్తారు. ఈ రాయికి అక్కడి స్థానికులు బంగారు రంగులో పూత పూశారు కనుకే దానికి ‘గోల్డెన్ రాక్’ అనే పేరు వచ్చింది. కాగా ఈ రాయి ఏటవాలుగా ఉన్నప్పటికీ అది ఉన్న స్థానం నుంచి దాన్ని ఇప్పటివరకు ఎవ్వరూ కదిలించలేకపోయారు. అంతేకాదు ఈ ప్రదేశంలో గోల్డెన్ రాయి ఎంతకాలంగా ఉందనే విషయం కూడా మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే అక్కడి ప్రజల నమ్మకం ప్రకారం 11వ శతాబ్దంలో ఒక బౌద్ధ సన్యాసి బుద్ధుడి తల వెంట్రుకలపై ఈ రాయిని ఎటవాలుగా ఉంచినట్లు వారు నమ్ముతారు. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే ఈ గోల్డెన్ రాక్ ను మహిళలు తాకితే అది కదులుతుందని అక్కడి ప్రజల విశ్వాసం. అందుకే ఈ రాయి దగ్గరికి మహిళలు వెళ్లకుండా నిషేధించారు. రాయిని తాకుండా, దూరం నుంచి చూసేందుకు మాత్రమే మహిళలకు అనుమతి ఉంటుంది.

ఇదీ చదవండి: అదో డెత్ వ్యాలీ.. అక్కడి రాళ్లు కదులుతాయి.. పరుగెతాయి కూడా..!

Exit mobile version
Skip to toolbar