Site icon Prime9

Amber Heard: గూగుల్లో ఈ ఏడాది ఎక్కువ మంది వెతికింది ఈమెనే..!

amber-heard-is the googles-most-searched-celebrity-of-2022

amber-heard-is the googles-most-searched-celebrity-of-2022

Amber Heard: ఒకరిపై మరొకరు పరువునష్టం దావాతో ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిన జంట హాలీవుడ్ తార అంబర్ హెర్డ్, నటుడు జానీ డెప్. ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువ మంది వీరి గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారట. గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ 2022 ఆధారంగా ఓ నివేదిక విడుదల అయ్యింది. ఈ ఏడాదిగాను ఎక్కువ మంది శోధించిన సెలబ్రిటీగా అంబర్ హెర్డ్ నిలిచింది. ఆ తర్వాత ఆమె మాజీ భర్త, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సినిమాలో ప్రధాన పాత్రధారుడు అయిన జానీ డెప్ రెండో స్థానంలో ఉన్నాడు.

సగటున ప్రతి నెలా 56 లక్షల మంది అండర్ హెర్డ్ గురించి సెర్చ్ చేశారు. ఇక జానీ డెప్ గురించి 55 లక్షల మంది పరిశోధించారని నివేదిక వెల్లడించింది. అయితే అమెరికన్ రియాలిటీ షో సెలబ్రిటీ కిమ్ కర్దాషియన్, ప్రపంచ సంపన్న వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ను వెనక్కి నెట్టేసి అంబర్ హెర్డ్ ముందు నిలవడం గమనార్హం.

కిమ్, ఎలాన్ మస్క్, ఫుట్ బాలర్ టామ్ బ్రాడీ, నటుడు పెటే డేవిడ్సన్, క్వీన్ ఎలిజబెత్ 2 కూడా జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. అంటే అంబర్, జానీ డెప్ తర్వాత ఎక్కువ మంది వీరి కోసం శోధించినట్టు నివేదిక తెలిపింది. క్విన్ ఎలిజబెత్ 2 గురించి తెలుసుకునేందుకు ప్రతి నెలా 43 లక్షల మంది గూగుల్ లో వెతికారట.

ఇదీ చదవండి: కూచిపూడి నృత్యంతో ఆకట్టుకున్న యూకే ప్రధాని రిషి సునక్ కూతురు

Exit mobile version