Site icon Prime9

Football: ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’.. ఆ బంతి విలువు రూ.19.5 కోట్లు

maradonas-hand-of-god-world-cup-ball-sold-for-19.4 crores

maradonas-hand-of-god-world-cup-ball-sold-for-19.4 crores

Football: ఫుట్‌బాల్‌ దిగ్గజం అర్జెంటీనా ఆటగాడు డిగో మారడోనా 1986 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ జట్టుతో క్వార్టర్స్‌లో కొట్టిన ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ గోల్‌ ఎంత ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలిసిందే. కాగా మారడోనా కొట్టిన ఆ బంతిని తాజాగా నిర్వహించిన వేలంలో దాదాపు 2.4 మిలియన్ డాలర్లు అనగా మన కరెన్సీలో రూ. 19.5 కోట్లకు అమ్ముడుపోయింది.

క్వార్టర్స్‌లో అర్జెంటీనా స్టార్‌ డిగో మారడోనా చేత్తో కొట్టిన ఆ గోల్‌ను మ్యాచ్‌ అధికారులెవరూ గుర్తించలేదు. కానీ ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’గా ప్రఖ్యాతి గాంచిన ఆ గోల్‌కు సాక్షిగా మిగిలిన ఆ బంతిని బుధవారం లండన్ లో వేలం వేశారు. కాగా ఆ మ్యాచ్‌లో రెఫరీగా వ్యవహరించిన అలి బిన్‌ నాసర్‌ దానిని కొనుగోలు చేయడం విశేషం. ఇకపోతే ఆ ప్రపంచ కప్ మ్యాచ్ లో మారడోనా మరో గోల్‌ కూడా కొట్టడంతో అర్జెంటీనా క్వార్టర్స్‌లో గెలిచింది. అదే జోరుతో ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఫుట్ బాల్ ఈ దిగ్గజ ప్లేయర్ మారడోనా తన 60వ ఏట 2020లో మరణించాడు.

ఇదీ చదవండి: ఐపీఎల్ జట్లు వదిలించుకున్న ఆటగాళ్ల లిస్ట్ ఇదే..!

Exit mobile version