Kieron Pollard: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. ఆ స్టార్ క్రికెటర్ ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వెస్టిండిస్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ ఐపీఎల్ వీడ్కోలు పలికారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన చేశారు. వచ్చే సీజన్ నుంచి తాను ఐపీఎల్ ఆడటం లేదంటూ పేర్కొన్నాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ అత్యధిక సార్లు టైటిల్ విజేతగా నిలవగా ఆ జట్టు విజయాల్లో పొలార్డ్ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ మొదటి నుంచి ముంబై ఇండియన్స్ కే ఆడిన పోలార్డ్ చివరి దాకా ఆ జట్టుతోనే ప్రస్థానం సాగించాడు. ఐపీఎల్ కు దూరమైనా కూడా తాను ముంబై ఇండియన్స్ తోనే సాగనున్నట్లుగా పొలార్డ్ ప్రకటనలో తెలిపారు.
💙 #OneFamily @mipaltan pic.twitter.com/4mDVKT3eu6
— Kieron Pollard (@KieronPollard55) November 15, 2022
ఐపీఎల్ లో దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా పొలార్డ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా ఐపీఎల్ మ్యాచ్ లలో మొత్తంగా 171 ఇన్నింగ్స్ లు ఆడి 3,412 పరుగులు చేశాడు. అందులో 16 హాఫ్ సెంచరీలున్నాయి. బౌలింగ్లో 69 వికెట్లు తీసిన పొలార్డ్ 103 క్యాచ్ లతో బెస్ట్ ఆల్ రౌండర్ గానే కాకుండా బెస్ట్ ఫీల్డర్ గానూ గుర్తింపు సాధించాడు. అయితే గత సీజన్ లో పొలార్డ్ అంతగా ప్రతిభ కనపర్చలేకపోయాడు. దానితో వచ్చే సీజన్ కు అతన్ని వదులుకునే దిశగా ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం ఆలోచన చేస్తుండగా అంతలోనే పొలార్డ్ ఏకంగా ఐపీఎల్ కే వీడ్కోలు పలకడం ఒకింత ఆశ్చర్యంగానూ మరింత బాధగానూ ఫీల్ అవుతున్నారు క్రికెట్ లవర్స్.
ఇదీ చదవండి: భారత్‌తో న్యూజిలాండ్ టీ20, వన్డే సిరీస్‌లు.. జట్టులో కీలక మార్పులు