Janasena Yuvashakthi: మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ రణస్థలంలో జరుగుతోన్న యువశక్తి సభలో తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు పవన్ కళ్యాణ్. మనదేశం సంపద యువత… యువత బంగారు భవిష్యత్ కోసం బాధ్యతగా పనిచేస్తా అన్నారు.. ఉత్తరాంధ్ర పొరాటాల గడ్డ.. ఉపాధిలేనప్పుడు.. వలసపై నాయకులు నిలదీయకపొతే ఎలా..? అని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనసేన యువశక్తి సభ నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ సభకు భారీస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు.
భారీ సంఖ్యలో యువత కూడా చేరుకున్నారు. జిల్లాలోని లావేరు మండలం తాళ్లవలస పంచాయితీ పరిధిలో 35 ఎకరాల ప్రైవేటు స్ధలంలో పవన్ సభ నిర్వహిస్తున్నారు. వివేకానంద జయంతిని పురస్కరించుకొని సభావేదికకు వివేకానంద వికాస వేదికగా నామకరణం చేశారు. వివేకానంద జయంతిని పురస్కరించుకొని సభావేదికకు వివేకానంద వికాస వేదికగా నామకరణం చేసారు. ఈ వేదికగా(Janasena Yuvashakthi) పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కారుపై, వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు.
నేను సాధించిన దానికి సంతోషం లేదు..
నేను సాధించనడానికి నాకు సంతోషం లేదన్నారు పవన్. నేను ఈరోజు ప్రతి సన్నాసి, యదవ చేత మాట అనిపించుకొకుండా ఉండగలను.. కేవలం మనకొసం జీవించే జీవితంకాకుండా సాటిమనిసి గూర్చి బ్రతకడం ఇష్టం. అన్నారు పవన్ కల్యాణ్.. రాజకీయ నేతలు ప్రజల్ని బానిపలుగా చూస్తున్నారు.. పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు నా వద్ద ఇంత సమూహం లేదన్నారు. మహా అయితే నాప్రాణం పోవచ్చు.. కానీ, పిరికితనం నాకు చిరాకు అన్నారు పవన్.
అలానే గెలుస్తానో ఓడిపోతానో కాదు.. పోరాటమే తెలుసు.. గెలుస్తావో ఓడిపోతానో కాదు.. పోరాటమే తెలుసన్నారు పవన్ కళ్యాణ్. ఎదవల్ని ఎదుర్కోవడం, గూండాలను తన్నడం తెలుసు.. ఉత్తరాంధ్ర యాత్ర చేసినప్పుడు నా వద్ద, పార్టీ వద్ద డబ్బులు లేవన్నారు.. నాకు సుఖాలమీద. మమకారం లేదు. ఉద్దానంలో సరైన త్రాగునీరు లేఖ రోగులైన వ్యక్తులను చూసాను.. ఉపాధి లేఖ నలిగిపోతున్న. యువతను చూశాన్నారు పవన్.. పార్టీ పెట్టినప్పుడు అకౌంట్‌లో ఉన్నది రూ.13 లక్షలే ఉన్నాయని .. అందరికంటే ఎక్కువ సుఖాలు చూశానని అన్నారు. అయినా కానీ ప్రజల కోసం పోరాడడమే తెలుసని స్పష్టం చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఇవి కూడా చదవండి:
కానిస్టేబుల్ కొడుకు పార్టీకి.. సైకిల్ మెకానిక్ కొడుకు మద్దతు
ఫస్ట్ టైం.. ఉత్తరాంధ్ర కళాకారులతో కలసి స్టేజిపై డ్యాన్స్ చేసిన పవన్ కళ్యాణ్
వైసీపీ జెండా మోసేవారికే సంక్షేమ పథకాలు- నాదెండ్ల మనోహర్
వైసీపీ జెండా మోసేవారికే సంక్షేమ పథకాలు- నాదెండ్ల మనోహర్
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/