Site icon Prime9

MLA Jagga reddy: ఎన్టీఆర్ వర్శిటీ పేరు మార్పు తప్పు.. జగ్గారెడ్డి

Name change of NTR varsity is wrong

Name change of NTR varsity is wrong

Hyderabad: ఏపిలో ఆరోగ్య విశ్వ విద్యాలయానికి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తప్పు బట్టారు. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న గొప్ప వ్యక్తి ఎన్టీఆర్, ఆయన పేరు మార్పును ఎవ్వరూ అంగీకరించరు, నేను ఖండిస్తున్నానంటూ కుండ బద్దలు కొట్టిన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన పలు ఆసక్తి కరమైన అంశాలను మీడియాకు తెలిపారు.

వైఎస్ఆర్ పరువును జగన్, షర్మిలలే తీసుకొంటున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భాజాపా వదిలిన బాణాలు జగన్, షర్మిల అంటూ హేళన చేసారు. నాడు ఏపిలో జగన్ కు అధికారం కట్టబెట్టేందుకు జగన్ వదిలిన బాణం షర్మిలగా ప్రచారం చేసుకొన్నారన్నారు. నేడు తెలంగాణాలో పాదయాత్ర చేస్తూ వైఎస్ వదిలిన బాణంగా చెప్పుకోవడం పై ఏమని మాట్లాడాలి అని ప్రశ్నించారు.

వైఎస్ మరణించిన సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏడుస్తుంటే, కుటుంబసభ్యులు సీఎం కావాలని స్కెచ్ వేస్తున్న విషయాన్ని తెలిపారు. షర్మిల తెలంగాణాలో ఎందుకు పార్టీ పెట్టిందో తెల్వదు. అలాగే ఎందుకు తిరుగుతుందో తెల్వదు అంటూనే షర్మిల కు జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చిన్నట్లు మమ్మల్ని తిడితే ఒప్పుకొనేది లేదన్నారు. ప్రజలకు ఏం చెప్పాలో చెప్పి ప్రచారం చేసుకోవచ్చని షర్మిలకు హితవు పలికారు.

వైఎస్ కూడా తప్పిదాలు చేసాడని జగ్గారెడ్డి అన్నారు. నాడు టిఆర్ఎస్ లో వున్న నన్ను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చిందే వైఎస్ అన్న జగ్గారెడ్డి, పార్టీ ఫిరాయింపులు ప్రారంభించిందే వైఎస్ఆర్ అని గట్టిగా చెప్పేసారు. ఆయన కూడా రెడ్డి కాంగ్రెస్ పార్టీ స్థాపించి కాంగ్రెస్ లోకి వచ్చాడని షర్మిల గుర్తుంచుకోవాలన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని మాత్రం వైఎస్ కోరుకున్నారని జగ్గారెడ్డి అన్నారు. వైఎస్ బొమ్మ పెట్టుకొన్న కొడుకు జగన్, కూతురు షర్మిల ఇద్దరూ ఆయన ఆశయాలకు కోసం పనిచేయడం లేదన్నారు.

ఇది కూడా చదవండి: రెండు కోట్లు స్వాహా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి

Exit mobile version