Site icon Prime9

Janasena Party: మంత్రులూ.. మీ పాలనాభివృద్ధిని వివరించరూ! సోషల్ మీడియా వేదికగా జనసేన సూటి ప్రశ్నలు

Ministers...explain your governance development

Ministers...explain your governance development

Andhra Pradesh: అధికార వైకాపా పార్టీని ప్రజల్లో ఎండగట్టేందుకు జనసేన పార్టీ కొత్త పంధాను ఎంచుకొనింది. విశాఖలో తన పర్యటనను అడ్డుకొని, జనసేన కార్యకర్తలపై పెట్టిన కేసులతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వైకాపా నేతలను ప్రజలే చీదరించుకొనేలా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా రాష్ట్రంలోని 7గురు మంత్రులను తొలుత టార్గెట్ చేస్తూ సూటి ప్రశన్నలు సంధించారు. అభివృద్ధిని చెప్పే దమ్ముందా అంటూ ప్రశ్నలను వేశారు. పవన్ వేసిన ప్రశ్నలు నెట్టింట ట్రోల్ అవుతూ వైకాపా నేతలకు చెమటలు పట్టిస్తున్నాయి.

రికార్డింగ్ డాన్సులు చేసుకొన్న తర్వాత నువ్వు రాష్ట్రానికి కష్టపడి తీసుకొచ్చిన పరిశ్రమల లిస్ట్ పై శ్వేతపత్రం విడుదల చేయగలవా గుడివాడా? అంటూ పవన్ చెప్పును చూపిస్తూ ప్రశ్నించారు. పర్యాటక రంగం అభివృద్ధి కోసం ఇప్పుటి నువ్వు చేసిన బృహత్ కార్యాలేమిటో ఏపీ ప్రజలకు సూటిగా చెప్పగల సత్తా ఉందా మహానటి రోజా అంటూ చూపుడు వేలు చూపిస్తూ పవన్ ప్రశ్నించారు. ఇంకెంత మందిని మీ గుంతల రహదార్లు బలి తీసుకుంటే మొద్ద నిద్ర వీడతారో తెలపగలరా దాడిశెట్టి అంటూ పవన్ చెప్పు చూపిస్తున్న ఫోటోను ప్రశ్నకు జత చేశారు. మీ సహచర మంత్రులు అనారోగ్యానికి పక్కరాష్ట్రాలకు పారిపోకుండా ఏపీలోనే వైద్యం చేయించుకొనే స్థాయి సదుపాయాలు ఎప్పుడు కల్పిస్తారు పబ్లిసిటీ క్వీన్ విడదల రజినీ అంటూ చూపుడు వేలును చూపిస్తూ పవన్ ప్రశ్నించారు.

ఏపీ అప్పుల చిట్టా ఎంత లెక్క చెప్తారా? ఒక్కో పౌరుడిపై ఎంత భారం మోపారో ప్రజలకి వివరణ ఇవ్వగలరా బుగ్గన? అంటూ చూపుడు వేలు చూపిస్తూ పవన్ ప్రశ్న సంధించారు. కొండలు, చెరువుల్లో కాకుండా నివాసయోగ్యమైన భూముల్లో నాణ్యమైన ఇళ్లు ఎన్ని కట్టించారో చూపగలవా జోగి? అంటూ పవన్ చెప్పును చూపిస్తే ప్రశ్నించారు. పాఠశాలల్లో విద్యార్ధులకి కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్ని దశాబ్దాలు పడుతుందో సామాన్య ప్రజలకు అర్ధమయ్యే భాషలో వివరించగలరా బొత్స అంటూ చూపుడు వేలుతో పవన్ ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: Devineni Uma: ఐపీఎస్, ఐఏఎస్ లు.. ముస్సోరిలో మీకు ఇచ్చిన ట్రైనింగ్ ఇదేనా? మాజీ మంత్రి దేవినేని ఉమ

Exit mobile version