Site icon Prime9

Budget 2023-24: కేంద్ర బడ్జెట్.. తెలుగు రాష్ట్రాలకు ఎన్ని కోట్లు కేటాయించారంటే?

nirmala budget

nirmala budget

Budget 2023-24: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు నిరాశే ఎదురైంది. ఈ బడ్జెట్‌లో ఇరు రాష్ట్రాలకు ఆశించిన కేటాయింపులు జరగలేదు. కేవలం కొన్ని కేటాయింపులకు మాత్రమే ప్రకటనలు వెలువడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు సంస్థలకు ప్రాధాన్యత దక్కింది. కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 41వేల 338 కోట్లు కాగా… తెలంగాణ వాటా 21వేల470 కోట్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్‌ యూనివర్సిటీకి 47 కోట్లు, పెట్రోలియం యూనివర్సిటీకి రూ.168 కోట్లు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.683 కోట్లు చొప్పున కేంద్రం ప్రతిపాదించింది.

తెలంగాణకు సంబంధించి సింగరేణికి రూ. 16వందల 50 కోట్లు కేటాయించారు.
ఐఐటీ హైదరాబాద్‌కు ఈపీఏ EPA కింద రూ. 300 కోట్లు కేటాయించింది.

మణుగూరు, కోటలోని భారజల కర్మాగారాలకు 14వందల 73 కోట్లు కేటాయించింది.
కేంద్రం తెలుగురాష్ట్రాలకు మరికొన్ని నిధులను కేటాయించినట్లు తెలిపింది.

మంగళగిరి, బీబీనగర్‌ ఎయిమ్స్‌తో పాటు దేశంలోని 22 ఎయిమ్స్‌ ఆస్పత్రులకు 6,835 కోట్లు అందిచనున్నట్లు బడ్జెట్‌ Union Budget 2023-24 లో పేర్కొంది.
మరోవైపు సాలార్జంగ్‌ మ్యూజియం సహా అన్ని మ్యూజియాలకు 357 కోట్లు ప్రతిపాదించింది.

తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన యూనివర్సిటీలకు రూ.37 కోట్లు ప్రకటించింది.

కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా 41,338 కోట్లు, తెలంగాణ వాటా 21,470 కోట్లుగా ఉన్నాయి.

ఈ గణాంకాలను చూస్తే తెలుగు రాష్ట్రాలకు పెద్దగా కేటాయింపులు జరగలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిలా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ పేరుని కూడా కేంద్ర ప్రభుత్వం కనీసం ప్రస్తావించలేదు.

ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ వైజాగ్‌ రైల్వేజోన్‌కు నిధులు కేటాయించలేదు.

చాలాకాలంగా ఉన్న డిమాండ్‌ను బడ్జెట్‌లో ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు.

తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి చూపించిన కేంద్రం… ఎన్నికలు జరగనున్న కర్ణాటకకు మాత్రం భారీగా నిధులు కేటాయించింది.

కర్ణాటకలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

ఇందులో భాగంగా అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు 5 వేల 300 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసినట్లు స్పష్టం చేశారు.

మరోవైపు ఈ కేటాయింపులపై ఏపీ ఆర్దిక మంత్రి బుగ్గన భిన్నంగా స్పందించారు.

అందరికీ ఉపయోగపడేలా కేంద్ర బడ్జెట్‌ ఉందని వ్యాఖ్యనించారు.

రాష్ట్ర ప్రభుత్వం సలహాల మేరకు కేటాయింపులు ఉన్నాయని అన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి మీడియాలో మాట్లాడారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version