Site icon Prime9

Hansika Marriage: హన్సిక పెళ్లిలో ప్రత్యేక అతిథులెవరో తెలుసా.. నెట్టింట వీడియో వైరల్

special-guests-for-hansika-wedding

special-guests-for-hansika-wedding

Hansika: బాలనటిగా అలరించి, ‘దేశముదురు’ చిత్రంతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన నటి హన్సిక. తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆ తర్వాత తమిళ, కన్నడ చిత్రాలతో దక్షిణాదిలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ అందాల తార నేడు పెళ్లి బంధంతో కొత్త జీవితం ప్రారంభించనుంది. తన ప్రియుడు సోహైల్ ను హన్సిక వివాహం చేసుకోనుంది. జైపూర్ లోని ఓ రాజకోటలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది. అయితే, తన పెళ్లిలో పాల్గొనేందుకు కొంతమంది అతిథులకు కూడా హన్సిక ప్రత్యేక ఆహ్వానాలు పంపింది.

రాజకోటలో జరిగే పెళ్లికి ప్రత్యేక ఆహ్వానాలు అంటే పెద్ద సెలబ్రిటీలు అనుకోవడం సహజం. కానీ, హన్సిక ఇందుకు భిన్నంగా తన గొప్ప మనసు చాటుకుటుంది. తాను ప్రత్యేకంగా తన పెళ్లికి పిలిచింది నిరుపేద చిన్నారులను కావడం విశేషం. హన్సిక తరచూ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. పలు ఎన్జీవోలతో కలిసి నిరుపేద చిన్నారులకు సాయం చేస్తోంది. ఈ క్రమంలోనే తన వివాహానికి అలాంటి కొందరు చిన్నారులకు సైతం ఆహ్వానాలు పంపించి తన మంచి మనసు చాటుకుంది. పెళ్లికి తమని పిలిచిన హన్సికకు ధన్యవాదాలు చెబుతూ ఆ చిన్నారులు చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

కాగా, పెళ్లికి ముందు జరిగే మెహెందీ, సంగీత్ లో కాబోయే దంపతులు హన్సిక, సోహైల్ చాలా సందడిగా గడిపారు. సంగీత్ లో ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేసి అతిథులను ఆకట్టుకున్నారు. ఆ వీడియోలను హన్సిక సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది.

ఇదీ చదవండి: గూస్ బంప్స్ తెప్పిస్తున్న “పవన్” సినిమా పోస్టర్.. “సాహో” డైరెక్టర్ తో కొత్త చిత్రం

Exit mobile version