Prabhas: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్ ప్రభాస్ గురించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వచ్చేవారం.. మాల్దీవుల్లో ప్రభాస్- కృతి సనన్ నిశ్చితార్థం జరగనున్నట్లు ఓ ట్వీట్ వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి వార్త తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్‌టాపికే. ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని ఫ్యాన్స్‌తో పాటు సెలబ్రెటీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ డార్లింగ్ మాత్రం పెళ్లి విషంయపై ఇప్పటివరకు స్పందించలేదు.
BREAKING NEWS: #KritiSanon & #Prabhas will get engaged next week in Maldives 🇲🇻!! So Happy for them.
— Umair Sandhu (@UmairSandu) February 5, 2023
ప్రభాస్- కృతి సనన్ ఎంగేజ్ మెంట్..
కొంతకాలంగా ప్రభాస్, కృతి సనన్ ప్రేమలో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపించాయి.
అయితే దీనిపై ప్రభాస్ ఏం స్పందించలేదు. ఈ విషయంలో.. కృతి సనన్ క్లారిటీ ఇచ్చారు.
దీంతో వీరి మధ్య ఎలాంటి ప్రేమాయణం లేదని.. అవన్నీ పుకార్లు అంటూ అభిమానులు కొట్టిపారేశారు.
అయినా వీరి విషయంలో పుకార్లు ఏ మాత్రం ఆగడం లేదు. తాజాగా బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు చేసిన ట్వీట్.. టాలీవుడ్, బాలీవుడ్ ను షేక్ చేస్తోంది.
వచ్చేవారం మాల్దీవుల్లో వీరిద్దరు.. ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు అంటూ ట్వీట్ ఇప్పుడు పెద్ద దుమారమే లేపుతోంది.
వారు కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ తో ప్రభాస్ పెళ్లి పుకార్లు తెగ వైరల్ గా మారాయి.
ప్రభాస్ అభిమానులు ఉమైర్ సంధును ఆడుకోవడం మొదలుపెట్టారు. వారి పెళ్లి గురించి మీకు తెలుసా.. కల్యాణ మండపం నిన్ను బుక్ చేయమన్నరా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
విమర్శల కోసం ఏది పడితే అది ట్వీట్ చేయవద్దని వార్నింగ్ కూడా ఇస్తున్నారు.
అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు
ఈ ట్వీట్ నిజమేనా..
ఈ ట్వీట్ చూసిన కొందరు ఇది నిజమేనా అంటూ.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. ఉమైర్ సంధు ఇలాంటి ట్వీట్లు చేస్తూ వివాదాల్లో నిలవడం అలవాటు.
బాలీవుడ్ సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలపై సంచలన ట్వీట్లు చేస్తూ.. తరచూ వివాదాల్లో చిక్కుకుంటుంటాడు.
ఇదివరకే అతడిపై పలు కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ట్వీట్ ను ఎవరు నమ్మడం లేదు. ఈ వ్యాఖ్యలను కొట్టి పారేస్తున్నారు.
ఇందులో నిజం లేదని అభిమానులు అంటున్నారు. కృతి సనన్ రిలేషన్‌పై గతంలో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ క్లారిటీ ఇచ్చాడు.
కృతి ప్రస్తుతం దీపికా పదుకొనె హీరోయిన్‌గా చేస్తున్న ఓ సినిమా హీరోతో ప్రేమలో ఉందంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశాడు.
కాగా దీపికా ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కె లో నటిస్తోంది.
వరుణ్ కామెంట్స్ ప్రభాస్-కృతి డేటింగ్ పుకార్లకు ఆజ్యం పోసినట్లయింది.
ప్రభాస్-బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో ప్రభాస్ పెళ్లిపై చరణ్ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
త్వరలోనే ప్రభాస్ Prabhas నుంచి గుడ్ న్యూస్ చెప్తాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఈ వార్తల్లో నిజం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
కాగా ప్రభాస్-కృతి జంటగా నటించని ఆది పురుష్ మూవీ ఈ ఏడాది వేసవి కాలంలో రిలీజ్ కానుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/