International News: ఇరాన్ నుండి చైనాకు వెళ్లుతున్న ఓ ప్యాసింజర్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో భారత్ వైమానిక అధికారులు అప్రమత్తమైనారు. సాంకేతిక కారణాలతో భారతదేశంలో చైనా వెళ్లే విమానాన్ని అత్యవసరంగా దింపేందుకు అనుమతి నిరాకురించారు. ఈ ఘటన ఉదయం 9.20గంటలకు చోటుచేసుకొనింది.
సమాచారం మేరకు, మహాన్ ఎయిర్ విమానం ఐఆర్ఎం 081 ఇరాన్ లోని టెహ్రాన్ నుండి చైనాలోని గ్వాంగ్ జౌకు బయల్దేరింది. భారత దేశ గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానం నుండి సమాచారం అందుకొన్న ఢిల్లీ విమానాశ్రయం అధికారులు ల్యాండింగ్ కు అనుమతి కోరారు.
అయితే సాంకేతిక కారణాల వల్ల అనుమతి లభించకపోవడంతో విమానాన్ని జైపూర్ కు మళ్లించారు. అక్కడ కూడా దిగేందుకు వీలు కాలేదు. ఇంకేమి చేసేది లేక విమానాన్ని చైనా వైపు మళ్లించారు. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్ సైట్ ద్వారా విమాన సమాచారాన్ని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు వివరాలు సేకరించారు.
ఇది కూడా చదవండి: Kidnap: చిలకలూరిపేటలో బాలుడి కిడ్నాప్.. నెల్లూరులో ఆచూకి..!