Site icon Prime9

NTR: ఆ విషయంలో ఎన్టీఆర్‌పై ఫుల్‌గా ట్రోలింగ్.. మన వాళ్ళని తక్కువ చేయొద్దంటూ వార్నింగ్

NTR in golden globe award

NTR in golden globe award

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు తెరపై తనదైన ముద్ర వేసి స్టారహీరోగా ఎదిగాడు. నటన, డాన్స్, డైలాగ్ లలో తనకు తానే పోటీగా నిలిచాడు. ఇక రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో దుమ్ములేపాడు ఎన్టీఆర్. కొమురం భీమ్ పాత్రలో తారక్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్, కొమరం భీముడో సాంగ్ లో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాతో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ను ఆకట్టుకుంది.

ఉత్తమ నటుడి అవార్డు రేసులో ఎన్టీఆర్

తాజాగా హాలీవుడ్ కు చెందిన వెరైటీ అనే మ్యాగజైన్ తారక్ గురించి ప్రస్తావించింది. తారక్ నటనకు ఆస్కార్ వచ్చే అవకాశం ఉంది అని సదరు మ్యాగజైన్ రాసుకొచ్చింది. దాంతో తారక్ అభిమానులంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. ‘ర్యాంక్ లేని’ విభాగంలో ఆస్కార్ ఉత్తమ నటుడు అవార్డుకు అవకాశం ఉన్న పోటీదారులలో జూనియర్ ఎన్టీఆర్ ను ఒకరిగా వెరైటీ మ్యాగజైన్ రాసుకొచ్చింది. మరి ఈ వార్త నిజమై తారక్ నామినేట్ అవుతారో లేదో చూడాలి. ఆస్కార్ కు నిజంగానే ఆర్ఆర్ఆర్ సినిమా కానీ తారక్ కానీ నామినేట్ అయితే అది మన తెలుగు సినిమాకు దక్కే గౌరవం. అయితే తజగా గోల్డెన్ గ్లోబ్ వేడుకల్లో పాల్గొనేందుకు ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రమోట్ చేసే పనిలో ఉన్న హీరోలపై ఒకవైపు హాలీవుడ్ మీడియా ప్రశంసలు కురిపిస్తుంటే.. మనం మాత్రం సోషల్ మీడియాలో వాళ్లను ట్రోల్ చేస్తున్నారు.


ఆస్కార్ ఓటర్స్ కోసం లాస్ ఏంజిల్స్‌లోని డీజీఏ థియేటర్‌లో ఈ సినిమాను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆస్కార్ ఓటర్స్‌‌తో ఎన్టీఆర్, ఎస్.ఎస్.రాజమౌళి ముచ్చటించారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ తన ఇంగ్లీష్ యాసను కాస్త మార్చి మాట్లాడినట్లు అనిపిస్తుంది. అమెరికన్ యాసలో యాక్సెంట్‌లో మాట్లాడటం ఎందుకని కొందరు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ విమర్శిస్తున్నారు. ఈ విమర్శలకు కొంత మంది వత్తాసు పలుకుతూ ఎన్టీఆర్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక తెలుగు హీరో విదేశాల్లో సైతం హాలీవుడ్ మీడియాతో తెలుగు సినిమా గురించి మాట్లాడుతున్న గొప్ప విషయాన్ని తక్కువ చేయొద్దంటూ పలువురు హితబోధ చేస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి…

సైలెంట్‌గా ఉపాసన ఎంట్రీ.. భార్యను రాంచరణ్ ఎలా పరిచయం చేశాడో చూడండి..

ఈ ఏడాది హాట్ స్టార్ కి షాక్.. ఆ ఓటీటీలో ఐపీఎల్ స్ట్రీమింగ్.. ఎన్ని భాషల్లో అంటే?

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో సత్తా చాటిన ఆర్ఆర్ఆర్.. బెస్ట్ సాంగ్ గా “నాటు నాటు”

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar