Site icon Prime9

Drugs Case : టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం.. రేవ్ పార్టీలో డ్రగ్స్ తో పట్టుబడిన మూవీ పైనాన్షియర్ వెంకట్

Tollywood financier arrested in drugs case at Madhapur rave party

Tollywood financier arrested in drugs case at Madhapur rave party

Drugs Case : హైదరాబాద్ నగరం నడిబొడ్డున మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతుంది. ఈ వ్యవహారంలో మల్లవ టాలీవుడ్ కి లింకు లు ఉండడం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.  మాదాపూర్ లోని విఠల్ రావ్ నగర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్ లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసారు. అపార్ట్ మెంట్ లోని ఓ ప్లాట్ కొందరు సినీ ప్రముఖులు, డిల్లీకి చెందిన అమ్మాయిలను పోలీసులు గుర్తించారు. ప్లాట్ లో డ్రగ్స్ ను కూడా పోలీసులు గుర్తించారు. పలు తెలుగు సినిమాలకు ఫైనాన్షియర్ గా వ్యవహరించిన వెంకట్.. రేవ్ పార్టీ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం అందుతుంది.

డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్న వెంకట్ గోవా నుండి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇలా గంజాయితో పాటు వివిధ రకాల డ్రగ్స్ తో సినీ రంగానికి చెందినవారితో పాటు ఇతర ప్రముఖులకు వెంకట్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నాడని బయటపడింది. మాదాపూర్ దాడిలో 15 గ్రాముల ఎండిఎంఏ, 30 ఎల్ఎస్టి పిల్స్ తో పాటు గంజాయి ప్యాకెట్లు కూడా పోలీసులకు చిక్కాయి.

 

 

మూవీ పైనాన్షియర్ వెంకట్ తో పాటు పట్టుబడిన బాలాజీ గతంలో వ్యభిచారం నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా ఈ ఇద్దరు వ్యభిచారం కేసులో రెండుసార్లు పట్టుబడ్డారని… అందుకు సంబంధించిన కేసులు వీరిపైన వున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కోణంలో విచారణ జరిపిన పోలీసులు తాజాగా ఇద్దరు అమ్మాయిలను కూడా వ్యభిచారం కోసమే తీసుకువచ్చినట్లు గుర్తించారు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని నమ్మించి ఈ ఇద్దరు అమ్మాయిలను తీసుకువచ్చి గత రెండు రోజులుగా ఇదే అపార్ట్ మెంట్ లో వుంచినట్లు సమాచారం. ఈ అమ్మాయిలతో గడిపేందుకే మిగతావారు అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది.

Exit mobile version