Telangana BJP : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. తాజాగా బీజేపీ అధిష్టానం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే రెండు విడతల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ.. గురువారం మధ్యాహ్నం 35మందితో కూడిన మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పొత్తులో భాగంగా జనసేనకు కొన్ని సీట్లను కేటాయించింది. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో తెలంగాణ కోర్ కమిటీ నేతలు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, తెలంగాణ కోర్ కమిటీ నేతలు కిషన్ రెడ్డి, డీకే అరుణ, ఈటల రాజేందర్, బండి సంజయ్, డా. కే. లక్ష్మణ్, ప్రకాశ్ జవడేకర్, తరుణ్ చుగ్ హాజరయ్యారు.
1. మంచిర్యాల – వీరబెల్లి రఘునాథ్
2. ఆసిపాబాద్ – అజ్మీరా ఆత్మారాం నాయక్ ( ఎస్టీ )
3. బోధన్ – వడ్డె మోహన్ రెడ్డి
4. బాన్సువాడ – ఎండల లక్ష్మీనారాయణ
5. నిజామాబాద్ రూరల్ – దినేష్
6. మంథని – చందుపట్ల సునీల్ రెడ్డి
7. మెదక్ – పంజా విజయ్ కుమార్
8. నారాయణఖేడ్ – జె.సంగప్ప
9. ఆంథోల్ – బాబుమోహన్ ( ఎస్సీ )
10. జహీరాబాద్ – రామచంద్ర రాజనర్సింహ ( ఎస్సీ )
11. ఉప్పల్ – ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్
12. ఎల్ బీ నగర్ – సామ రంగారెడ్డి
13. రాజేంద్రనగర్ – తోకల శ్రీనివాస్ రెడ్డి
14. చేవేళ్ల – కెఎస్ రత్నం ( ఎస్సీ )
15. పరిగి – మారుతి కిరణ్
16. ముషీరాబాద్ – పూస రాజు
17. మలక్ పేట – సురేందర్ రెడ్డి
18. అంబర్ పేట – కృష్ణయాదవ్
19. జూబ్లీహిల్స్ – లంకల దీపక్ రెడ్డి
20. సనత్ నగర్ – మర్రి శశిధర్ రెడ్డి
21. సికింద్రాబాద్ – మేకల సారంగపాణి
22. నారాయణపేట – కె.రతంగ్ పాండురెడ్డి
23. జడ్చర్ల – చిత్తరంజన్ దాస్
24. మక్తల్ – జలంధర్ రెడ్డి
25. వనపర్తి – ఆశ్వథామరెడ్డి
26. అచ్చంపేట – దేవని సతీష్ మాదిగ ( ఎస్సీ )
27. షాద్ నగర్ – అందే బాబయ్య
28. దేవరకొండ – కేతావత్ లాలునాయక్ ( ఎస్టీ )
29. హుజూర్ నగర్ – చల్లా శ్రీలత రెడ్డి
30. నల్గొండ – మాదగాని శ్రీనివాస్ గౌడ్
31. ఆలేరు – పడాల శ్రీనివాస్
32. పరకాల – కాళి ప్రసాద్ రావు
33. పినపాక – పొడియం బాలరాజు ( ఎస్టీ )
34. పాలేరు – నూనె రవికుమార్
35. సత్తుపల్లి – రామలింగేశ్వరరావు ( ఎస్సీ )
The Central Election Committee of the Bharatiya Janata Party has decided the names for the ensuing General Elections to the Legislative Assembly of Telangana. pic.twitter.com/gBiItOpDJC
— BJP (@BJP4India) November 2, 2023