Site icon Prime9

Rs.1.08 crore seized of granite companies: రూ. 1.08 కోట్లు స్వాధీనం చేసుకొన్నాం…గ్రానైట్ కంపెనీల సోదాలపై ఈడీ

Rs. 1.08 crore seized...ED on searches of granite companies

Telangana: తెలంగాణలోని గ్రానైట్ కంపెనీ కార్యాలయాలు, యజమానుల ఇళ్లపై జరిపిన సోదాల్లో రూ. 1.08 కోట్లు స్వాధీనం చేసుకొన్నామని ఈడీ అధికారులు తెలిపారు. పదేళ్లకు సంబంధించిన లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకొన్నామన్నారు. సోదాల్లో పలు విషయాలు బయటపడ్డాయన్నారు.

బినామీ బ్యాంకు ఖాతాలు గుర్తించామన్నారు. శ్వేత గ్రానైట్స్, శ్వేత ఏజెన్సీస్, ఎస్వీజీ ప్రైవేట్ లిమిటెడ్, పీఎస్ఆర్ గ్రానైట్స్, అరవింద్ గ్రానైట్స్, గిరిరాజ్ షిప్పింగ్ ఏజెన్సీస్ తోపాటు వాటి అనుబంధ సంస్ధల్లో సోదాలు నిర్వహించామన్నారు. లావాదేవీల్లో రాష్ట్ర విజిలెన్స్ శాఖ అందచేసిన నివేదకకు, చేసిన ఎగుమతుల మద్య పొంతన కుదరలేదన్నారు. రాయల్టీ పన్ను చెల్లింపుల్లో భారీగా తేడాలున్నట్లు తేలిందన్నారు. కరీంనగర్ నుండి విశాఖ, కాకినాడ మీదుగా ఓడరేవులు, రైలు మార్గం ద్వారా చైనా, హాంకాంగ్ కు భారీగా ఎగుమతులు చేశారని, అయితే రికార్డుల్లో తక్కువగా చూపించారన్నారు. ఎగుమతి నగదును పలు గ్రానైట్ కంపెనీల యజమానులు తమ ఉద్యోగుల పేరు మీద బినామీ ఖాతాల్లో జమ చేయించిన్నట్లు సోదాల్లో బయటపడిందన్నారు. అక్కడ నుండి వచ్చిన నగదును రుణం కింద తీసుకొన్నట్లు లెక్కలో చూపారన్నారు. కాని ఎక్కడా అప్పుకింద తీసుకొన్నట్లు దృవపత్రాలు లేవన్నారు.

పన్ను ఎగవేతదారుల పేర్లను పనమా లీక్స్ ప్రకటించిందని, అందులో చైనాకు చెందిన లీవెన్ హ్యూ పేరుందన్నారు. తాజాగా జరిపిన సోదాల్లో లీవెన్ హ్యూకు చెందిన బ్యాంకు ఖాతాల నుండి లావాదేవీలు జరిగిన్నట్లు తేలిందన్నారు. గ్రానైట్ కంపెనీలు ఫెమా నిబంధనలు ఉల్లంఘించిన్నట్లు ప్రాధమికంగా గుర్తించామన్నారు. పీఎస్ఆర్ గ్రానైట్స్ యజమాని పాలకుర్తి శ్రీధర్ ను ఈడీ కార్యాలయంలో ప్రశ్నించారు. మిగిలిన గ్రానైట్ కంపెనీ యజమానులు తాము సూచించన ఈనెల 18న ఈడీ కార్యాలయానికి రావాల్సి ఉంటుందని వారికి నోటీసులు కూడా ఇచ్చామన్నారు. ఈడీ సోదాలు చేసిన కంపెనీల్లో ఓ మంత్రికి చెందిన కార్యాలయాలు, ఇండ్లు ఉండడంతో టిఆర్ఎస్ శ్రేణులు సోదాలపై నోరుమెదపటం లేదు.

ఇది కూడా చదవండి: Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం.. అరబిందో ఫార్మా డైరెక్టర్‌ అరెస్ట్

Exit mobile version