Site icon Prime9

Jubilee Hills Pubs: నిబంధనలు అతిక్రమణ.. జూబ్లీహిల్స్ లో రెండు పబ్బుల పై కేసులు

Police have registered cases against two pubs in Jubilee Hills for violating the rules

Hyderabad: హైకోర్టు ఉత్తర్వులను సైతం పెడచెవిన పెడుతున్నారు. పోలీసులు దాడులు చేస్తున్నా అనుకొన్నది వారు చేసేస్తున్నారు. దీంతో రెండు పబ్బుల పై హైదరాబాదు పోలీసులు కేసులు నమోదు చేశారు. సమాచారం మేరకు నిన్నటిదానం అర్ధరాత్రి జూబ్లీహిల్స్‌లోని అమ్నీషియా పబ్, ఇన్సోమినియా పబ్‌ల పై పోలీసులు దాడులు నిర్వహించారు. విరుద్ధంగా రాత్రి 10 గంటలు దాటినప్పటికీ పబ్బుల్లో సౌండ్‌ అనుమతిస్తున్నారని గుర్తించారు. దీంతో ఆయా పబ్‌ల యజమానులు రాజా శ్రీకర్‌, కునాల్‌, మేనేజర్‌ యూనిస్‌ల పై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదుచేశారు. గతంలో కూడా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నందుకుగాను అమ్నీషియా పబ్‌ను సీజ్‌చేశారు. కొన్ని ఘటనల నేపథ్యంలో నగరంలోని ప్రతి పబ్బులో సీసి కెమరాల పర్యవేక్షణను పోలీసులు చేపట్టిన్నప్పటికీ పబ్ యజమానులు యధేచ్చగా నిబంధనలను అత్రికమించడం పట్ల పోలీసుల తీరును అనుమానించాల్సి వస్తుంది.

ఇది కూడా చదవండి: Munugode by poll: మునుగోడు ఉప ఎన్నికల హోరా హోరీ ఫలితాలు రౌండ్ల వారీగా

Electric Shock: కైకలూరులో విషాదం.. విద్యుత్ షాక్ కు గురై ఒకరు మృతి

Exit mobile version