Site icon Prime9

Hyderabad: చికెన్ లేదని..పెళ్లి ఆగింది.. ఎక్కడంటే..?

marriage-was stopped-due-to-not-serve-chicken-in-feast

marriage-was stopped-due-to-not-serve-chicken-in-feast

Hyderabad: వివాహం అన్నాక విందు కామన్. కొంతమంది అయితే పెళ్లిళ్లలో విందులో వడ్డించే ఐటమ్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. అయితే వివాహ విషయంలో ఒక్కోదగ్గర ఒక్కో సంప్రదాయం ఉంటుంది. దానికి అనుగుణంగానే కొన్ని ప్రత్యేక వంటకాలు ఉంటాయి. ఈ తరహాలో కొన్ని ప్రాంతాల పెళ్లిళ్లలో మాంసాహారం అనేది కచ్చితంగా ఉంటుంది. కాగా తాజాగా ఓ పెళ్లి విందులో చికెన్ వడ్డించలేదన్న కారణంతో మగ పెళ్లివారు వివాహాన్ని రద్దు చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలోని షాపూర్‌నగర్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలో పెళ్లైనా, పేరంటమైనా, బరాత్ అయిన బర్త్ డే అయిన వేడుక ఏదైనా నాన్ వెజ్ అనేది కామన్. ముక్కలేకపోతే ముద్ద దిగదంటుంటారు. కాగా జగద్గిరిగుట్ట రింగ్ బస్తీకి చెందిన యువకుడికి, కుత్బుల్లాపూర్‌కు చెందిన యువతికి వివాహం నిశ్చయమైంది. షాపూర్‌నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో సోమవారం ఉదయం పెళ్లి జరగాల్సి ఉండగా ఆదివారం రాత్రి ఆడపెళ్లివారు విందు ఏర్పాటు చేశారు. అయితే పెళ్లికూతురిది బీహార్‌కు చెందిన మార్వాడీ కుటుంబం కావడం వల్ల విందులో అన్నీ శాకాహార వంటలే చేశారు.

విందు ఇక ముగుస్తుందన్న సమయంలో వరుడి తరపు స్నేహితులు భోజనాలకు వచ్చారు. అక్కడున్న శాకాహార వంటలు చూసి చికెన్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించి గొడవకు దిగారు. తినకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇది వధూవరుల కుటుంబాల మధ్య గొడవకు కారణమైంది. దానితో చివరికి నిన్న జరగాల్సిన వివాహం ఆగిపోయింది. ఈ మేరకు వధువు కుటుంబ సభ్యులు జీడిమెట్ల సీఐని కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఇరు కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వడంతో వివాహం బుధవారం జరిపించాలని నిర్ణయించారు.

ఇదీ చదవండి: తెగ తిన్నారు.. మాంసం వినియోగంలో తెలంగాణ @1

Exit mobile version