Site icon Prime9

Minister Mallareddy: నా కొడుకును ఐటీ అధికారులు కొట్టారు- మంత్రి మల్లారెడ్డి

malla-reddy-not-attending-for-it-Enquiry

malla-reddy-not-attending-for-it-Enquiry

Minister Mallareddy: మంగళవారం నాడు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. ఆయనను హైదరాబాద్ లోని సూరారంలో ఉన్న ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ తరుణంలో మల్లారెడ్డి తన కొడుకును చూడడానికి ఆసుపత్రి వద్దకు వచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఐటీ అధికారులు తన కొడుకుని తనిఖీల పేరుతో వేధించారని ఆరోపించారు. తన కొడుకుని ఐటీ అధికారులు కొట్టారని,  రాత్రంతా సీఆర్పీఎఫ్ బలగాలతో కొట్టించారని అందుకే ఆయన ఆసుపత్రి పాలయ్యారని అన్నారు.  తాము దొంగ వ్యాపారాలు చేయడం లేదని, కాలేజీలను స్థాపించి సేవ చేస్తున్నామని చెప్పారు. ఎన్నో ఏళ్లపాటు కష్టపడితే ఈ స్థాయికి చేరుకున్నామని అన్నారు. బీజేపీ రాజకీయ కక్షతోనే కేంద్ర వ్యవస్థలతో అక్రమంగా దాడులు చేయిస్తోందని ఆరోపించారు.

కావాలనే తమపై 200 మంది అధికారులతో ఐటీ దాడులు చేయించి భయపెట్టాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆసుపత్రికి మల్లారెడ్డితో పాటు ఐటీ అధికారులు కూడా వచ్చారు.

ఇదీ చదవండి: అధికారి కాలర్ పట్టుకుని తోసేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

Exit mobile version