Site icon Prime9

Pawan Kalyan : తెదేపా అధినేత చంద్రబాబు ఇంటికి జనసేనాని పవన్ కళ్యాణ్..

Pawan Kalyan meet chandrababu naidu at jubilee hills house

Pawan Kalyan meet chandrababu naidu at jubilee hills house

Pawan Kalyan : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ తో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చికిత్స కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన ఏఐజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇవాళ ఉదయం నగరంలోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి వెళ్లి కంటి పరీక్షలు చేయించుకుని వచ్చారు. అయితే చంద్రబాబు మంగళవారం నాడు కంటికి సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకునే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.

ఈ నేపథ్యంలో చంద్రబాబును జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.65 లోని బాబు నివాసానికి పవన్ వచ్చారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పవన్… చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని.. త్వరగా పూర్తి ఆరోగ్యంతో కొలుకోవాలని ఆకాంక్షించినట్లు సమాచారం అందుతుంది.

Exit mobile version