Site icon Prime9

Janasena Party : పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరిన మొగలిరేకులు సీరియల్ హీరో సాగర్ ..

mogalirekulu fame sagar joined in pawan kalyan janasena party

mogalirekulu fame sagar joined in pawan kalyan janasena party

Janasena Party :  నటుడు సాగర్‌.. మొగలి రేకులు సీరియల్‌తో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సీరియల్ లో ఆర్కే నాయుడు పాత్రతో ప్రేక్షకులను మెప్పించి అండదరికి చేరువయ్యారు. కాగా పలు సినిమాల్లోనూ క్యారెక్టర్ రోల్స్‌ పోషించాడు. ఉదయ్ కిరణ్‌ మనసంతా నువ్వే, ప్రభాస్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ సినిమాల్లో కనిపించిన ఈ యంగ్ హీరో  2016లో “సిద్ధార్థ” సినిమాతో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని 2021లో “షాదీ ముబారక్‌” సినిమాతో మెరిశాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు, శిరీష్ విడుదల చేసిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించాడు. ఇక ప్రస్తుతం “ది హండ్రెడ్‌” అనే సినిమాలో సాగర్‌ నటిస్తున్నాడు.

అయితే రీసెంట్ గా పలు టీవి కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ మళ్ళీ యాక్టివ్ అవుతున్నాడు సాగర్. కాగా కొద్ది నెలల క్రితం పవన్‌ కల్యాణ్‌ను కలిశారు సాగర్‌. అనంతరం ఈ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ పవన్ గురించి గొప్పగా రాసుకొచ్చారు. దాంతో సాగర్‌ రాజకీయాల్లోకి అడుగుపెడతారని ప్రచారం జరిగింది. ఇప్పుడీ ఊహాగానాలను నిజం చేస్తూ సాగర్ జనసేన పార్టీలో చేరారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో కళ్యాణ్ సమక్షంలో సాగర్ తో పాటు పలువురు ప్రముఖులు పార్టీలో చేరారు.

 

 

పవన్ కళ్యాణ్..  సాగర్ కి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా  సాగర్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ ప్రజల కోసం నిలబడుతోంది. పవన్ కళ్యాణ్ నాయకత్వం, ఆయన ప్రజా పోరాటాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో నెరవేరుస్తాను” అన్నారు. ప్రస్తుతం ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అలానే సాగర్ తో పాటు  హైదరాబాద్ నగరానికి చెందిన స్థిరాస్థి వ్యాపారి, గ్రేటర్ హైదరాబాద్ వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ జనసేనలో చేరారు. అలానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు లక్కినేని సురేందర్ రావు తన అనుచరులతో కలసి పార్టీలో చేరారు. అదే జిల్లాకు చెందిన ముయ్యబోయిన ఉమాదేవి, ఆమె భర్త నాగబాబు పార్టీలో చేరారు.

Exit mobile version