Site icon Prime9

Mahesh Babu: కృష్ణానదిలో కృష్ణ అస్తికలు నిమజ్జనం

super-star-maheshbabu-reach-vijayawada-to-immerse-late-father-krishna's-moral-remains-into-krishna river

super-star-maheshbabu-reach-vijayawada-to-immerse-late-father-krishna's-moral-remains-into-krishna river

Mahesh Babu: సనాతన హిందూ ధర్మ సంప్రదాయం ప్రకారం మరణించిన వ్యక్తి అస్థికలను పుణ్య నదుల్లో నిమజ్జనం చేస్తారు. ఇలా చెయ్యడం వల్ల వారి ఆత్మ పుణ్యలోకాలకు చేరుతుందని భావిస్తారు. ఈ తరుణంలోనే ఇటీవల మృతి చెందిన సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను కృష్ణా నది సహా దేశంలోని పవిత్ర నదుల్లో నిమజ్జనం చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా నేడు కృష్ణ అస్థికలను కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. తండ్రి అస్థికలను నిమజ్జనం చేయడం కోసం ప్రిన్స్ మహేష్ బాబు విజయవాడ వెళ్లారు.
మహేష్ బాబుతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆయన బావ ఎంపీ గల్లా జయదేవ్, మహేష్ బాబు బాబాయ్ శేషగిరిరావు, నాగ సుధీర్, సూర్య సహా పలువురు హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి కారులో కృష్ణా నది ఉండవల్లి కరకట్ట మీద ఉన్న ధర్మనిలయం వద్దకు చేరుకున్నారు. కృష్ణానదిలో కృష్ట అస్తికలు కలిపి, శాస్త్రోక్తమైన కార్యక్రమాలు నిర్వహించారు మహేష్ బాబు. మహేష్ బాబు విజయవాడ రాక సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కృష్ణా ఘాట్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: “నాన్నకు ప్రేమతో”.. మహేష్ బాబు కీలక నిర్ణయం

Exit mobile version