Site icon Prime9

Minister Roja: “ఫ్లూటు బాబు ముందు ఊదు జగనన్న ముందు కాదు” బాలయ్యకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

roja fire on balakrishna due to NTR health university issue

roja fire on balakrishna due to NTR health university issue

Roja Strong Counter To Bala krishna: ఇటీవల కాలంలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుతో ఏపీలో రాజకీయ రగడ మొదలయ్యింది. ఈ విషయం పై అటు తెదేపా నేతలు సహా నందమూరి కుటుంబం మరియు అభిమానులు జగన్ ప్రభుత్వం పై ఘాటుగా స్పందిస్తున్నారు. కాగా తాజాగా వర్సిటీ పేరు మార్పు విషయంలో బాలకృష్ణ వ్యాఖ్యల పై మంత్రి రోజా ట్విట్టర్ ద్వారా స్పందించారు.

మొన్న జూనియర్ ఎన్టీఆర్ నిన్న బాలకృష్ణ  విజయవాడలోని ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు తగదంటూ, ఎన్టీఆర్ అనేది పేరు కాదని ఆంధ్రుల ఆరాధ్యదైవం, తెలుగవాడి నాడి అంటూ స్పందించిన విషయం విదితమే. ఈ క్రమంలో బాలకృష్ణ తన ట్విట్టర్ ద్వారా మార్చటానికి, తీసేయ్యడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదని, తెలుగు జాతి వెన్నెముక అని ట్వీట్ చేశారు. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చారని, కొడుకు అధికారం చేపట్టి యూనివర్సిటీ పేరు మారుస్తున్నారని, మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారని పంచభూతాలున్నాయని తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే. కాగా ఈ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి రోజా ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘బాలయ్య, ఫ్లూటు బాబు ముందు ఊదు, జగనన్న ముందు కాదు, అక్కడ ఉంది రీల్ సింహం కాదు, జ’గన్’ అనే రియల్ సింహం తేడా వస్తే దబిడి దిబిడే’ అంటూ ట్వీట్ ద్వారా బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చారు.

ఇదీ చదవండి: Balakrishna: ఎన్టీఆర్ అన్నది పేరు కాదు.. తెలుగు జాతి వెన్నెముక.. నందమూరి బాలకృష్ణ

Exit mobile version