Site icon Prime9

Pawan Kalyan: ఏపీకి మంచి రోజులు వస్తాయి.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

pawan-modi-meet

pawan-modi-meet

Andhra Pradesh: కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న తరువాత ప్రధాని మోడీ  విశాఖపట్నం చేరుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్రన్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి మారుతి జంక్షన్ వరకు రోడ్డు మార్గంలో, విశాఖ వాసులకు కారునుంచి అభివాదం చేస్తూ వెళ్లారు. తరువాత ఐఎన్ఎస్ చోళాకు చేరుకున్న మోడీ, అక్కడ పవన్‌ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ కంటే ముందుగా  బీజేపీ నేతలతో మీటింగ్‌ షెడ్యూల్‌లో ఉన్నా కూడా నరేంద్ర మోడీ, పవన్‌తోనే ముందుగా భేటీ అయ్యారు. అంతేకాకుండా 10 నిమిషాల సమయం ఇచ్చి 35నిమిషాలు చర్చించారు. ఆ భేటీ పూర్తయిన తరువాతే ఏపీ బీజేపీ ముఖ్యనేతలతో మోడీ భేటీ అయ్యారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ తరువాత మీడియాతో మాట్లాడారు. తమ మద్య జరిగిన మీటింగ్ వివరాలను పవన్ కళ్యాణ్ తెలపలేదు. కానీ  ఎనిమిది ఏళ్ల తర్వాత మోదీతో భేటీ అయ్యానని, అది కూడా ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన భేటీ అంటూ తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ బాగుండాలన్నదే ప్రధాని మోడీ కోరిక అని, ఏపీలోని పరిస్థితులన్నీ మోడీ అడిగి తెలుసుకున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇకనైనా ఆంధ్ర ప్రదేశ్ కి మంచిరోజులు వస్తాయని నమ్ముతున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Exit mobile version