Site icon Prime9

Pawan Kalyan : ప్రమాదవశాత్తు చనిపోయిన జనసేన సభ్యుల కుటుంబాలతో పవన్ కళ్యాణ్ సమావేశం.. అండగా ఉంటానని హామీ

pawan kalyan pay tributes to accidentally died janasena members

pawan kalyan pay tributes to accidentally died janasena members

Pawan Kalyan : మీరంతా మా కుటుంబం.. మీకు అండగా నిలబడటం మా బాధ్యత.. కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే అది తీరని లోటు.. దానిని ఎవరూ తీర్చలేం కానీ మీకు ఏ కష్టం వచ్చినా మేమున్నామని ఆదుకునేందుకు అతి పెద్ద జనసేన కుటుంబం అండగా ఉంటుంది. చనిపోయిన. మీ కుటుంబ సభ్యులు ఏ ఆశయం కోసం చివరి వరకు జనసేన పార్టీ కోసం అండగా నిలిచారో.. వారి ఆశయాన్ని గౌరవించి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జనసేన పార్టీ అధ్యకులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రమాదవశాత్తు మరణించిన 48 క్రియాశీలక సభ్యుల కుటుంబాలతో పవన్ శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన ముగ్గురు జనసైనికుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున బీమా చెక్కులు అందించారు. తొలుత ప్రమాదవశాత్తు చనిపోయిన క్రియాశీలక సభ్యుల చిత్రపటానికి జ్యోతిప్రజ్వలన చేసి, పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ” ఖజానాలో లక్షల కోట్లున్న రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పని- ఏ అధికారం లేకపోయినా జనసేన పార్టీ సమర్ధవంతంగా చేస్తోంది. పార్టీ క్రియాశీలక సభ్యులను సొంత కుటుంబ సభ్యులుగా భావించి ఆపత్కాలంలో ఆర్ధికంగా ఆ కుటుంబాలకు అండగా నిలుస్తోంది. పోయిన ప్రాణాలను తీసుకురాలేము కానీ.. వారి కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకోవడం ద్వారా భరోసా ఇవ్వడం మన కనీస బాధ్యత, పోరాట యాత్ర సమయంలో ప్లెక్సీలు కడుతూ ఇద్దరు అభిమానులు కరెంటు షాకుతో మృత్యువాతపడ్డారు. దిగువ మధ్యతరగతికి చెందిన ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఆనాడే సొంత నిధుల నుంచి చెరో రూ. 5 లక్షల చొప్పున ఇచ్చాం. అయితే సంఖ్యా బలం పెరుగుతున్న కొద్ది వ్యక్తిగత సాయం చేసే ప్రక్రియ కష్టమవుతుంది. అయినా ప్రతి ఒక్కరికి సాయం అందాలనే ఆలోచన మాత్రం నా మనసులో ఉంది. పార్టీ కోసం అహర్షి శలు కష్టపడే కార్యకర్తలకు ప్రమాద బీమా చేపడదామని చాలా మంది మేధావులతో మాట్లాడాను. చివరకు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఇన్సురెన్స్ ఆలోచన తీసుకొచ్చారు. మనోహర్ గారి ఆలోచనను కోశాధికారి శ్రీ రత్నం గారు, మిగిలిన జనసేన నాయకులు ఇన్సురెన్స్ కంపెనీలతో మాట్లాడి నిర్దుష్ట విధానాన్ని తీసుకొచ్చారు. ప్రమాదవశాత్తు ఏ క్రియాశీలక సభ్యుడు చనిపోయినా, గాయపడినా తక్కువ సమయంలో ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకున్నారు.

అలానే నాకు ఇంతవరకు హెల్త్ ఇన్సురెన్స్ గానీ, ప్రమాద బీమా గానీ ఏవీ లేవు. నేను ఎప్పుడూ నా గురించి ఆలోచించుకోలేదు. నేను సగటు సామాన్యుడి క్షేమం గురించి ఎక్కువగా ఆలోచిస్తాను. నేను కోటి మందికి ఆర్థికపరమైన అండ ఇవ్వలేకపోవచ్చు గానీ వారిలో ఒక స్ఫూర్తి రగిలించగలను. నా పరిధిలో నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తితో జన సైనికులు తమ తమ స్థాయిలో ఆపదలో ఉన్నవారికీ, అభాగ్యులకు అండగా ఉంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో దివ్యాంగులైన జంటకు జన సైనికులు సాయపడ్డ తీరు కదిలించింది. ఆ దంపతులకు ఏం సాయం చేయాలి అడిగితే జీవనోపాధిగా చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకుంటాం అన్నారు.

క్రియాశీలక సభ్యులు 50 వేల మంది ఉంటే చాలు అనుకున్నాను కానీ పార్టీ బలపడుతున్న కొద్దీ సంఖ్య నేటికి 6.76 లక్షల మందికి చేరింది. మనకోసం ఆలోచించే సభ్యులకు మానవతా దృక్పదంతో అండగా నిలబడటం మన బాధ్యత. అందుకే ప్రమాద బీమా చెక్ స్వయంగా మనోహర్ ఎంత దూరమైనా వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మీకు మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చి వస్తున్నారు. ఈ విధానం వల్ల బంధం మరింత బలపడుతుంది. చనిపోయిన వ్యక్తుల ఆశయం ఒక్కటే. సమాజం మారాలి… పరివర్తన రావాలని జనసేన పార్టీలోకి వచ్చారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత” అని తెలిపారు.

Exit mobile version