Pawan Kalyan : జనసైనికులతో కలిసి భారీ ర్యాలీగా తిరుపతి ఎస్పీ ఆఫీస్ కి పవన్ కళ్యాణ్..

జనసేన అధినేత నేడు తిరుపతికి వెళ్తున్న విషయం తెలిసిందే. ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు కొట్టే సాయిపై దాడి చేసిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సిఐ) అంజు యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన తిరుపతి జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించనున్నారు. అందుకు గాను ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతికి చేరుకున్నారు.

  • Written By:
  • Publish Date - July 17, 2023 / 12:14 PM IST

Pawan Kalyan : జనసేన అధినేత నేడు తిరుపతికి వెళ్తున్న విషయం తెలిసిందే. ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు కొట్టే సాయిపై దాడి చేసిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సిఐ) అంజు యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన తిరుపతి జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించనున్నారు. అందుకు గాను ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతికి చేరుకున్నారు. ఇప్పుడు ర్యాలీగా జన సైనికులతో కలిసి అక్కడి నుంచి భారీ ర్యాలీగా తిరుపతి ఎస్పీ కార్యాలయానికి బయలుదేరారు.

ఇక ఇప్పటికే ఈ ఘటనపై సీఐ అంజు యాదవ్‌కి అధికారులు చార్జ్ మెమో జారీ చేశారు. అలానే ఇప్పుడు ఐదుగురు జనసేన కార్యకర్తలతో కలిసి ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సీఐపై ఫిర్యాదు చేయనున్నారు. అయితే, ఇటు పవన్‌ రాక, మరోవైపు పవన్ కు వ్యతిరేకంగా వాలంటీర్ల ఆందోళనలు జరుగుతాయన్న అనుమానంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ ర్యాలీ కారణంగా ఎస్పీని కలవడం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

అంతకు ముందు ఏం జరిగిందంటే..

పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన కామెంట్స్‌కు వ్యతిరేకంగా వైసీపీ నేతలు, వాలంటీర్లు నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు పవన్ (Pawan Kalyan) కు మద్దతుగా.. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన శ్రేణులు కూడా శ్రీకాళహస్తిలో నిరసన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆ క్రమం లోనే జనసేన నేత సాయిపై అంజు యాదవ్ చేయి చేసుకున్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ ఘటనపై స్పందించిన పవన్..  శాంతియుతంగా ధర్నా చేయడం ప్రజాస్వామ్యంలో హక్కు అని పేర్కొన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్నవారిని కొట్టే హక్కు ఏ పోలీసు అధికారికి లేదని అన్నారు. తానే శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లాకు వస్తానని.. అక్కడే తేల్చుకుందామని అన్నారు. తమ వాళ్లను ఎందుకు కొట్టారని ప్రశ్నించారు. తమ నాయకుడిని కొడితే.. తనను కొట్టినట్టేనని తప్పకుండా అక్కడికే వస్తానని చెప్పారు. పోరాడితే పోయేదేమి లేదు.. బానిస సంకెళ్లు తప్ప అని పవన్ పేర్కొన్నారు. ఎస్పీని కలిసిన అనంతరం పవన్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.