Mangalagiri: మరొక్క సారి ప్యాకేజ్ స్టార్ అని నన్ను అంటే వైకాపా శ్రేణులను చెప్పుతో కొడతానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. దవడ వాచిపోయేలా కొడతానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కాలికి ఉన్న చెప్పును తీసి మరీ వైకాపా నేతలను పవన్ హెచ్చరించారు. పవన్ కల్యాణ్ మంగళగిరిలో తన కార్యకర్తల సమావేశంలో వైసిపి శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్యాకేజి స్టార్ అంటున్న వారికి కొన్ని వివరాలను పవన్ సభాముఖంగా తెలిపారు. జనసేన పార్టీకి వచ్చిన విరాళాలు, తన కుటుంబసభ్యులు ఇచ్చిన నగదు వివరాలను అందులో పేర్కొన్నారు. ఈ మద్య కాలంలో 6 సినిమాలు చేశాను. అటు ఇటుగా 120 కోట్ల వరకు సంపాదించానన్నారు. అందుకు సంబంధించిన రూ. 33,374776 లను పన్ను కింద చెల్లించానన్నారు. ఇందులో జీఎస్టీ అధనంగా తెలిపారు. 2021లో జనసేన పార్టీకి ఫండ్ గా 5కోట్లు విరాళం ఇచ్చానని పవన్ పేర్కొన్నారు. ఇవి గాక హుద్ హుద్ తుఫాను, సైనిక్ పోర్టు, పిఎం, తెలుగు సీఎంల రిలీఫ్ ఫండ్ లకు దాదాపుగా రూ. 12కోట్లు దాకా ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. విరాళం తీసుకొన్న వారిలో నన్ను తిడుతున్న వైకాపా ప్రభుత్వం కూడా ఉందన్నారు.
ఇవి కాకుండా రూ. 30లక్షల రూపాయలను అయోధ్య రామమందిర నిర్మాణానికి ఇచ్చాన్నారు. జనసేన పార్టీ స్థాపించిన్నప్పటి నుండి అంటే 2014 నుండి విరాళాల రూపంలో రూ. 17,58,6383 రూపాయలు 5బ్యాంకుల్లో పార్టీ కార్పస్ ఫండ్ రూపంలో ఉన్నాయన్నారు. రైతు భరోసా కింద రూ. 35078226 లు విరాళాల రూపంలో వచ్చాయన్నారు. నా సేన కోసం రూ. 43219795 లు విరాళాలు అందించారన్నారు.
తనలోని సహనమే, ఇనాళ్లు వైకాపా శ్రేణులు ఎన్ని మాట్లాడుతున్నా సహించేలా చేసిందన్నారు. వైసిపి గుండాల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, ఎదవల్లారా, సన్నసుల్లారా అంటూ వైకాపా శ్రేణులను పవన్ దుయ్యబట్టారు. వైసిపీలో క్రిమినల్స్ ఉన్నారా? గూండాలున్నారా? రౌడీలున్నారా? వారందరిని ఒంటి చేత్తె మెడపిసికి తొక్కి పారేస్తానని పవన్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Somu Veerraju: పవన్ పట్ల పోలీసుల తీరు కిరాతకం.. సోము వీర్రాజు