Pawan Kalyan : స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుని కలిసేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేశ్ తాజాగా జైలు లోపలికి వెళ్ళడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు వీరు చంద్రబాబును కలవనున్నారు. సమావేశం సందర్భంగా చంద్రబాబుతో పవన్ కీలక విషయాలను చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ క్రమంలో లోకేష్ ముందుగానే రాజమండ్రిలో ఉండగా.. బాలయ్య ఈరోజు ఉదయాన్నే ఇక్కడికి చేరుకున్నారు. ఇక మరి కొద్ది సమయం తర్వాత పవన్ కూడా రాజమండ్రి చేరుకొని ముగ్గురు కలిసి జైలు లోపలికి వెళ్లారు. జైలు వద్దకు జనసైనికులు, టీడీపీ అభిమానులు ఎవరూ రాకుండా ఆంక్షలు విధించారు.
ఇదివరకే తొలి దఫా ములాఖత్ లో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణిలు కలిశారు. కాగా ఇప్పుడు పవన్, బాలకృష్ణ, లోకేష్ ముగ్గురు కలిసి చంద్రబాబుతో భేటీ కానుండడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. జైలు వద్దకు జనసైనికులు, టీడీపీ అభిమానులు ఎవరూ రాకుండా ఆంక్షలు విధించారు. అలానే టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడుసైతం చంద్రబాబుతో గురువారం రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాఖత్ కానున్నట్లు తెలిసింది.
చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజున పవన్ (Pawan Kalyan) .. ప్రభుత్వం కుట్ర పూరిత అరెస్టును ఖండిస్తూ వీడియో విడుదల చేశారు. అదే రోజు ఆయన విజయవాడ రావాల్సి ఉండగా ఆయన విమానానికి అనుమతించవద్దని పోలీసులు ఎయిర్ పోర్టుకు లేఖ రాశారు. దాంతో ఆయన ఫ్లైట్‌లో విజయవాడ రాలేకపోయారు. రోడ్డు మార్గం ద్వారా వస్తూంటే ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఆయనను అదుపులోకి తీసుకుని తామే స్వయంగా మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో వదిలి పెట్టారు.