Pawan Kalyan: వైసీపీ మంత్రులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో అభివృద్ధిపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు పలు వ్యాఖ్యలు చేశారు. దీనిక బదులుగా వైకాపా నేతలు తెలంగాణపై పలు విమర్శలు గుప్పించారు. తాజాగా వీటిపై పవన్ కళ్యాణ్ స్పందించారు.
తెలంగాణ ప్రజలకు వైసీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి pic.twitter.com/s3OGDfF1mM
— JanaSena Party (@JanaSenaParty) April 16, 2023
క్షమాపణలు చెప్పాలి.. (Pawan Kalyan)
వైసీపీ మంత్రులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో అభివృద్ధిపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు పలు వ్యాఖ్యలు చేశారు. దీనిక బదులుగా వైకాపా నేతలు తెలంగాణపై పలు విమర్శలు గుప్పించారు. తాజాగా వీటిపై పవన్ కళ్యాణ్ స్పందించారు.
మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అభివృద్ధిలో తెలంగాణకు, ఏపీకి చాలా తేడా ఉందని ఆయన వ్యాఖ్యనించారు. దీనిపై తీవ్రస్థాయిలో ఏపీ మంత్రులు స్పందించారు. ఓ దశలో సోషల్ మీడియాలో సైతం విమర్శలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై మండిపడ్డారు. వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
హరీశ్‌రావుకు సమాధానం చెప్పకుండా.. తెలంగాణ ప్రజలను వైకాపా నేతలు తిట్టడం సరికాదన్నారు.
ఈ మేరకు పవన్ వీడియో సందేశాన్ని జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ వీడియోలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడటం సరికాదన్నారు.
వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని సూచించారు.
హరీశ్ రావు విషయంలోకి తెలంగాణ ప్రజలను వైసీపీ నేతలు ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు.
రాజకీయంగా విమర్శలు చేయాలి గాని.. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజలపై ఇష్టానుసారంగా మాట్లాడినందుకు ఏపీ మంత్రులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కాగా ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏపీ తెలంగాణ నేతల మధ్య విమర్శలు కొనసాగాయి.
టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా ఆవిర్భవించాక దేశ వ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్న క్రమంలో ఏపీలో కూడా గులాబీ పార్టీ కాలుమోపాలనుకుంటోంది.
ఈ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్ లో బీఆర్ఎస్ పాల్గొనలానుకోవటం వంటి పరిణామాలు కీలకంగా మారాయి.
అలాగే బీఆర్ఎస్ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాజకీయ లబ్ది కోసమే ఎత్తుగడలు వేస్తోందని మొదట్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించి ఇప్పుడు బిడ్ వేస్తాననటంపై ఏపీ వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నారు.
రాజకీయ లబ్ది కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ బీఆర్ఎస్ వాడుకోవాలని చూస్తోందంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.
హరీష్ రావు సైతం ఈ విషయంపై స్పందించారు. తెలంగాణ ఏం అభివృద్ధి జరిగిందో తెలుసుకోవాలంటే ఏపీ మంత్రులు తెలంగాణ వస్తే చూపిస్తామంటే హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.