Site icon Prime9

Nagababu : మీరు రాజధాని చెయ్యటం ఏంట్రా బాబు.. వైసీపీ నేతలపై నాగబాబు సెటైర్లు

Nagababu

Nagababu

Nagababu: మూడు రాజధానులకు మద్ధతుగా విశాఖలో నిర్వహించిన విశాఖ గర్జన సభపై జనసేన నేత, సినీనటుడు నాగబాబు ట్వీట్ చేశారు.  Vizag ని మీరు రాజధాని చెయ్యటం ఏంట్రా బాబు . Vizag already రాజధాని అమ్మమొగుడు లాంటి సిటీ. వీలైతే ఇండియాకి రెండవ రాజధాని చెయ్యమని గర్జించండి . అంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. విశాఖలో పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో నాగబాబు చేసిన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.

రేపు (అక్టోబర్ 16) ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేన పార్టీ నిర్వహించే జనవాణి కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొంటారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల సమస్యలపై వచ్చే ఆర్జీలను పవన్ కల్యాణ్ స్వీకరించనున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అక్కయపాలం హైవే రోడులోని పోర్ట్ కళావాణి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జనవాణి కార్యక్రమం నిర్వహిస్తారు.

Exit mobile version