Site icon Prime9

Vande Bharat Rail: హైదరాబాద్-విజయవాడ మధ్య వందేభారత్ రైలు.. ఎప్పటి నుంచి అంటే..?

Vande Bharat train

Vande Bharat train

Vande Bharat Rail: దేశవ్యాప్తంగా పలు రూట్లలో వందేభారత్ రైళ్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు దక్షిభారతం అందులోనూ తెలంగాణ ఆంధ్రా మధ్య కూడా ఓ రైలు పరుగులు పెట్టనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ నిర్ధారించారు. ఇప్పటికే ఐదు వందేభారత్ రైళ్లు పట్టాలు ఎక్కగా ఇప్పడు ఇది ఆరోది. ఈ రైలు గరిష్ఠ వేగం 180 కిలోమీటర్లు. రెండు నిమిషాల్లోనే 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ రైలులో సీట్లు మాత్రమే ఉంటాయి, బెర్తులు ఉండవు. కాబట్టి తొలుత ఈ రైలును సికింద్రాబాద్-విజయవాడ మధ్య నడపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మున్ముందు బెర్తులతో కూడిన వందేభారత్ రైళ్లు రానున్నాయి. అప్పుడు విశాఖ వరకు పొడిగించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్-విజయవాడ మార్గంలో ఈ నెలలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రైలును ప్రారంభించేందుకు దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది.

కాగా, ఈ రైలు ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి కాజీపేట మీదుగా, రెండోది నల్గొండ మీదుగా. అయితే ఈ రెండు మార్గాల్లో వెళ్లడానికి ఈ రైలుకు ట్రాక్ సామర్థ్యం సరిపోదు. కాజీపేట మార్గంలో ట్రాక్ గరిష్ఠ వేగం 130 కిలోమీటర్లు కాగా, నల్గొండ మార్గంలో ఇది 110 కిలోమీటర్లుగా ఉంది.
దానితో వందేభారత్ రైలు కోసం ట్రాక్ సామర్థ్యాన్ని 180 కిలోమీటర్లకు పెంచాల్సి ఉంటుంది. త్వరలోనే ట్రాక్ అప్‌గ్రేడ్, సిగ్నలింగ్, ఇతర పనులను దక్షిణమధ్య రైల్వే చేపట్టే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: నేనొక ఓడిపోయిన రాజకీయ నాయకుడిని.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Exit mobile version