Site icon Prime9

Vijay Devarakonda: పుష్ప 2 తరువాత సుకుమార్ తో మూవీ.. విజయ్ దేవరకొండ

Tollywood: దర్శకుడు సుకుమార్‌తో గతంలో విజయ్ దేవరకొండ ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమా ఇప్పటి వరకు సెట్స్ పైకి రాలేకపోయింది. విజయ్ తన ప్రాజెక్ట్స్ లైగర్, కుషి మరియు జన గణ మనతో బిజీగా ఉండగా, సుకుమార్ తన చిత్రం పుష్ప 2 కోసం పని చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే, సుకుమార్‌తో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్ గురించి విజయ్ అప్‌డేట్ ఇచ్చాడు. ఇటీవలి ఇంటర్వ్యూలో, పుష్ప 2 పూర్తి చేసిన తర్వాత సుకుమార్‌ తో తన చిత్రం ప్రారంభమవుతుందని చెప్పాడు. 2023 చివరి భాగంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావచ్చని కూడా అతను సూచించాడు. ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్‌ పై కేదార్ సెలగంశెట్టి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

విజయ్ నటించిన లైగర్ చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో అనన్య పాండే కథానాయికగా నటించింది. రమ్యకృష్ణ, రోహిత్ రాయ్, మైక్ టైసన్ ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఛార్మి కౌర్ మరియు కరణ్ జోహార్ ఈ ప్రాజెక్ట్‌ను పూరీతో కలిసి సంయుక్తంగా నిర్మించారు.

Exit mobile version