Site icon Prime9

Viral News: ఆకాశంలో అద్భుత దృశ్యం.. అలలై ఎగసిన మేఘాలు..!

Rare wave clouds in sky

Rare wave clouds in sky

Viral News: ప్రకృతి ఎంతో సుందరమైనది. చూసే కళ్లు ఆస్వాధించే.. మనసు ఉండాలే కానీ అణువణువునా అందాలు దాగి ఉంటాయి. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల, ఆడపిల్ల, కావేవీ కవితకు అనర్హం అని అంటుంటారు. అలానే భూమి, ఆకాశం, నక్షత్రాలు, చెట్లుచేమలు, సముద్రాలు ఇలా ప్రకృతిలో ప్రతీది కవి హృదయాన్ని చలింపజేస్తాయి. మరియు అలాంటి సుందరమైన దృశ్యాలు, ప్రదేశాలు ఏవైనా సరే ప్రజల మనసులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఒక్కోసారి ఆకాశంలో కనిపించే ఆకృతులు ఎంతో ఆకర్షనీయంగా ఉంటూ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మీకు ఎక్కడైనా ఆకాశంలో సముద్రాన్ని చూశారా.. కనీసం ఆకాశాన్ని తాకిన సముద్రాన్ని చూశారా లేదు కదా అయితే ఈ దృశ్యం చూడండి..

అమెరికాలోని రాష్ట్రమైన వ్యోమింగ్‌లో మీ కళ్లను మీరే నమ్మలేని దృశ్యం ఒకటి కనిపించింది. ఆకాశంలోని మబ్బులు అలలు మాదిరిగా ఉవ్వెత్తున ఎగసి పడుతున్నట్టుగా కనిపించాయి. వీటిని చూసిన అక్కడి ప్రజల ఇదెక్కడా కనిపించని వింత అంటూ ఆశ్చర్య వ్యక్తం చేస్తూ తమ ఫోనుల్లో క్లిక్కుమనిపించారు. ఓషన్ సర్ఫ్ లాగా క్షితిజ సమాంతరంగా క్రాష్ అవుతున్న అరుదైన మేఘాల ఫోటోలను ఆకాశ వీక్షకులు తమ కెమెరాల్లో బంధించారు. కాగా ఈ సుందరమైన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. షెరిడాన్ నగరం నుండి బిఘోర్న్ పర్వతాల శిఖరంపై మంగళవారంనాడు ఈ అరుదైన సన్నివేశం కనిపించింది.

ఇలా ఆకాశంలో ఏర్పడిన ఈ వింతను కెల్విన్-హెల్మ్‌హోల్ట్జ్ అస్థిరత అని పిలుస్తారని నిపుణులు వెల్లడిస్తున్నారు. గాలి యొక్క వేగవంతమైన ప్రవాహం క్రింద నుంచి పెరుగుతున్న గాలిపై కదులుతున్నప్పుడు ఇలా మేఘాలు సముద్రపు అలల మాదిరిగా ఏర్పడతాయని వివరించారు. ఈ సుందర దృశ్యాన్ని ప్రపంచానికి పరిచయం చెయ్యడం కోసం ది లెన్స్ ద్వారా ఫేస్‌బుక్ పేజీ వ్యోమింగ్‌లో పోస్ట్ చేశారు.

కెల్విన్-హెల్మ్‌హోల్ట్జ్ మేఘాల యొక్క అత్యంత అద్భుతమైన మరియు ఇతిహాసమైన ఉదాహరణలలో ఈ చిత్రాలు కూడా ఒకటని మాట్ టేలర్ అనే వెదర్ రిపోర్టర్  చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఈ మేఘాల అందంలో మరో అద్బుతం ఏంటంటే నిజంగానే ఇవి వాతావరణంలోని ద్రవత్వాన్ని కలిగి ఉంటాయని అతను తెలిపారు.

సముద్రంలో అలల లాగా వాతావరణం కదులుతుందని మరియు దాని చుట్టూ ఉన్న పర్యావరణానికి ప్రతిస్పందిస్తుందని వాతావరణ శాస్త్రవేత్తులు పేర్కొంటున్నారు. గాలి ప్రభావవంతంగా పైకి లేచి ఆకాశంలోని మబ్బుల మీద దొర్లుతోంది. దీనిని భౌతిక శాస్త్రవేత్తలు లార్డ్ కెల్విన్ మరియు హెర్మాన్ వాన్ హెల్మ్‌హోల్ట్జ్ పేరు మీద మేఘాల నిర్మాణానికి పేరు పెట్టారు. అనేక క్లౌడ్ స్పాటర్స్ సేకరణలలో భాగంగా ఇలా ఆకాశంలో ఏర్పడే నిర్మాణాలను యూకే-ఆధారిత క్లౌడ్ అప్రిసియేషన్ సొసైటీ వివరిస్తుంది.

ఇదీ చదవండి:  “గోబ్లిన్ మోడ్”.. ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ “వర్డ్ ఆఫ్ ద ఇయర్”

Exit mobile version
Skip to toolbar