Site icon Prime9

Posani Krishna Murali vs Ashwini Dutt : టాలీవుడ్ లో ముదిరిన రాజకీయం రగడ.. అశ్వనీదత్ కి కౌంటర్ ఇచ్చిన పోసాని

posani-krishna-murali-vs-ashwini-dutt-issue in tollywood got trending in ap

posani-krishna-murali-vs-ashwini-dutt-issue in tollywood got trending in ap

Posani Krishna Murali vs Ashwini Dutt : తెలుగు చిత్ర పరిశ్రమలో రాజకీయాల రగడ కొత్తది ఏమి కాదు. అయితే ఇప్పుడు ఊహించని రీతిలో మళ్ళీ అనూహ్యంగా తెరపైకి వచ్చింది. నంది పురస్కారాలపై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ చేసిన వ్యాఖ్యలకు పోసాని కృష్ణ మురళి ఇప్పుడు గట్టి కౌంటర్ ఇవ్వడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏం జరిగిందో మీకోసం ప్రత్యేకంగా..

ఉత్త‌మ గూండా, ఉత్తమ రౌడీ అవార్డులు – అశ్వనీదత్ (Posani Krishna Murali vs Ashwini Dutt)..

ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని కృష్ణ సూపర్ హిట్ ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. కృష్ణ సోదరుడు, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఈ విషయాన్ని తెలిపారు. ఆ సమావేశంలో విలేకరులు నంది పురస్కారాల గురించి ప్రశ్నించారు. ఆ కార్యక్రమానికి అశ్వినీదత్, తమ్మారెడ్డి భరద్వాజ , పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా సహోదరులు అడిగే పలు ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే నంది అవార్డుల గురించి ప్రశ్నించగా అశ్వనీదత్  ప్రస్తుతం ఏపీలో ఉన్న ప్రభుత్వం మీద పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇంతకీ ఏం అన్నారంటే.. ఇప్పుడు నడుస్తున్న సీజన్ వేరు కదా.. ఉత్త‌మ గూండా, ఉత్తమ రౌడీ.. వాళ్ళకు ఇస్తారు. సినిమాకు ఇచ్చే రోజులు మ‌రో రెండు, మూడు ఏళ్ల‌లో వస్తాయి అని అశ్వినీదత్ చెప్పారు. అంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విజయం సాధిస్తుందని.. అప్పుడు సినిమాలకు అవార్డులు ఇస్తారని ఆయన వ్యాఖ్యానించినట్లు పలువురు అభిప్రాయపడుతూ వారి వారి శైలిలో అశ్వనీదత్ వ్యాఖ్యలకు కౌంటలు ఇస్తున్నారు.

ఉత్తమ వెన్నుపోటు దారుడు అవార్డు ఇవ్వాలి కదా – పోసాని

ఇప్పుడు తాజాగా ఈ వ్యాఖ్యలపై పోసాని కృష్ణమురళి స్పందించారు. అశ్వనీదత్ అన్న పొరపాటున ఒక్క మాట మర్చిపోయాడు.. గతంలో ఒకసారి నాతో ఆయన ఏమన్నారంటే? ఉత్తమ వెన్నుపోటు దారుడు, ఉత్తమ లోఫర్, ఉత్తమ డాఫర్ వంటి అవార్డులు ఇవ్వాలని చెప్పారు. అసలు, జగన్ ప్రభుత్వం అవార్డులు ఇస్తే కదా! ఒకవేళ ఆయన నంది అవార్డులు ఇస్తే.. జగన్ మనుషులకు అవార్డులు ఇచ్చుకున్నారని చెప్పవచ్చు. తప్పు లేదు. కానీ, మాటలు ఇంకో రకంగా చెప్పారు. అంతకు ముందు పైన చెప్పిన అవార్డులు ఇచ్చారు. ఉత్తమ గురికాడు.. నారా చంద్రబాబు నాయుడు మనిషి చెప్పు తీసుకుని గురి చూసి ఎన్టీ రామారావును కొట్టాడు కదా, అతనికి అవార్డులు ఇచ్చారు అని పోసాని కృష్ణమురళి ఘాటుగా వ్యాఖ్యానించారు. సినిమా ఇండస్ట్రీలో తాను 37 ఏళ్లుగా ఉన్నానని, నీ బ్రతుకు నాకు తెలుసు. నా బ్రతుకు నీకు తెలుసు. కొంచెం అయినా నీతితో బ్రతుకుదాం. నేను మీ కాళ్లకు దణ్ణం పెడతాను’ అని పోసాని అన్నారు. ‘ఎన్టీఆర్‌ని చెప్పులతో కొట్టినప్పుడు నువ్వు ఏం చేసావ్’ అని ఆయన ప్రశ్నించారు.

అవును.. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నంది అవార్డులు ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతోంది. రెండేళ్లు కరోనా వచ్చింది. దాని నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుకున్నారు. తర్వాత దేనికి ప్రియారిటీ ఇవ్వాలో దానికి ఇస్తున్నారు. జగన్ గారు అవార్డులు ఇస్తే, ఎవరూ పేరు పెట్టని విధంగా ఇస్తారు అని పోసాని అన్నారు. నంది అవార్డుల మీద అశ్వనీదత్ సెటైర్లు వేయడం కరెక్ట్ కాదని, ఎప్పుడైనా ఉత్తమ గుండా, ఉత్తమ రౌడీ అవార్డులు ఇచ్చారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన నంది అవార్డుల్లో తనకు ‘టెంపర్’కు అవార్డు ఇవ్వగా కమ్మ కుల అవార్డుగా అనిపించి తీసుకోలేదని చెప్పారు.

Exit mobile version