Site icon Prime9

Pawan Kalyan In Unstoppable 2 : పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పిన పవన్ కళ్యాణ్.. దుమ్మురేపుతున్న అన్ స్టాపబుల్ పార్ట్ 2 ఎపిసోడ్

political party starting reasons revealed by Pawan Kalyan In Unstoppable 2

political party starting reasons revealed by Pawan Kalyan In Unstoppable 2

Pawan Kalyan In Unstoppable 2 : ఆహా ఓటీటీ వేదికగా నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్ టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ షో లో ఇప్పటికే పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ మేరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల బాలయ్య షో లో పాల్గొన్న విషయం తెలిసిందే.

పవన్ ఎపిసోడ్ ని రెండు పార్ట్ లుగా రిలీజ్ చేశారు.

ఇటీవలే రిలీజ్ అయిన ఫస్ట్ పార్ట్ రికార్డులన్నీటిని చెరిపేసి కొత్త రికార్డులను సృష్టించింది.

దీంతో అటు నందమూరి అభిమానులు.. ఇటు మెగా అభిమానులు రెండో ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూశారు.

పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ, ప్రస్తుత పరిస్థితులు వంటి అంశాల మీద ఈ ఎపిసోడ్ ఉందనున్నట్లు రిలీజ్ అయిన ప్రోమోలను చూస్తే తెలుస్తుంది. ఈ తరుణంలోనే తాజాగా రిలీజ్ అయిన ఎపిసోడ్ కూడా అదిరిపోయిందని చెప్పాలి. బాలయ్య తన ఎనర్జీ తో ఈ ఎపిసోడ్ ను అద్భుతంగా హోస్ట్ చేశారు. దానితో పాటు పవన్ – బాలయ్య మధ్య సరదా సంబాషణలు.. కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ తో పాటు.. పవర్ స్టార్ గురించి కొత్త కొత్త విషయాలు కూడా చర్చకు వచ్చాయి. ఈసందర్భంగా పవర్ స్టార్ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అని చెప్పుకొచ్చారు.

జనసేన ప్రారంభానికి కారణం అదే – పవన్ కళ్యాణ్ (Pawan Kalyan In Unstoppable 2)..

అంతకు ముందు జరిగిన సంఘటనలను పవన్ గుర్తు చేసుకుంటూ.. నల్గొండ జిల్లాలో ఒకప్పుడు ఫ్లోరోసిస్‌ సమస్య తీవ్రంగా ఉండేది. ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని, రక్షిత మంచి నీటిని అందించాలని ప్రయత్నం చేశా. ఆ మేరకు కొద్దిమందిని అక్కడికి పంపిస్తే స్థానిక రాజకీయ గ్రూప్స్‌ అడ్డుకున్నాయి. మంచి చేయడానికి కూడా అడ్డంకులు ఉంటాయా? అనిపించింది. ఎన్జీవో ప్రారంభించాలనుకున్నా. తర్వాత నా ఆలోచనా పరిధికి ఎన్జీవో సరిపోదనిపించింది. ఇంకా పెద్దగా ఏదో చేయాలనుకున్నాను.

అలా ఆలోచించి రాజకీయ పార్టీ పెట్టాం. నేను ఓ ఆలోచనతో ఉన్నా. అదే సమయంలో..  ఓసారి కలవాలంటూ నరేంద్ర మోదీ గారి నుంచి నాకు కబురు వచ్చింది. మార్చిలో పార్టీ పెట్టాం. ఎన్నికలు ఏప్రిల్‌ మధ్యలో వచ్చాయి. ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉండే స్టార్‌డమ్‌ పాలిటిక్స్‌లో కూడా వచ్చేస్తుందని చాలామంది అనుకుంటారు. ఎన్‌. టి. రామారావు, ఎంజీఆర్‌ గారి విషయంలో అది జరిగింది. అందరికీ అలానే అవుతుందని లేదు. ఆ స్పష్టత నాకుంది. రాం మనోహర్‌ లోహియా, లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ప్రభావం నాపై చాలా ఎక్కువగా ఉంది. ఓ స్థాయిలో ఉండి కిందకు పడిపోయినా మళ్లీ అక్కడ నుంచి మొదలు పెట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నా. నాకు పాలిటిక్స్‌ నేర్చుకోవాలనుంది అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ఫుల్ ట్రెండ్ అవుతుంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version